CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మరియమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంది.మంత్రి పువ్వాడ.*

Share it:


 

౼ కుమారుడికి రూ.15లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం, ఇద్దరు కుమార్తెలు చెరో రూ.10లక్షలు పంపిణీ.


ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామంకు చెందిన దళిత మహిళ అంబడిపూడి మరియమ్మ కుటుంబాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పరామర్శించారు. వారి కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. అనంతరం మరియమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

మరియమ్మ మృతి అత్యంత బాధాకరమని, ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని మంత్రి స్పష్టం చేశారు. 

ఈ సంఘటనలో మరణించిన మరియమ్మ కుటుంబాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు న్యాయం చేశారని పేర్కొన్నారు. కుమారుడు ఉదయ్ కిరణ్ కి రూ.15 లక్షల చెక్కు, ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వులను వారికి కుటుంబానికి స్వయంగా అందజేశారు.  

ఇద్దరు కుమార్తెలకు ప్రభుత్వం తరుపున చెరో రూ.10 లక్షలు మొత్తం రూ. 35 లక్షల నగదు, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్  ఆదేశాల మేరకు అందజేశామన్నారు. 

కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు , జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , ఎమ్మెల్యే భట్టి విక్రమార్క , జిల్లా కలెక్టర్ RV కర్ణన్ , పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్  , విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు , అదనపు కలెక్టర్ మధుసూదన్ , అదనపు డీసీపీ బోస్ , సాంఘిక సంక్షేమ జిల్లా అధికారి కే సత్యనారాయణ గారు తదితరులు ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: