CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా బాధితులకు ఆత్మస్థైర్యం పెంపొందించడమే దివ్యౌషధం సతీష్ గుండపునేని..

Share it:

 


కరోనా సోకిన దివ్యాంగ బాధితులకు నిత్యవసర వస్తువులు, ఔషధాలు, పంపిణీ చేసిన టీవిపీఎస్ సభ్యులు...



మన్యం టీవీ : జూలూరుపాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం ఎస్సీ కాలనీలో  కరోనా సోకి ఇంట్లోనే చికిత్స పొందుతున్న దివ్యాంగ కుటుంబాలకు నిత్యవసర వస్తువులు, ఔషధాలు పంపిణీ చేసి కారోనా బాధిత కుటుంబాలలో ఆత్మస్థైర్యాన్ని, అవగాహను టివిపిఎస్ సభ్యులు మంగళవారం కల్పించారు. ఈ సందర్భంగా  సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు, విజేఏసి చైర్మన్ సతీష్ గుండపునేని మాట్లాడుతూ.. కరోనా రెండో దశ వలన ప్రజలను ఆర్థికంగా, ఆరోగ్య పరంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా కరోనా సోకి ఇంటికే పరిమితమైన దివ్యాంగులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు అని. దయచేసి కరోనా బాధితులు అనవసర అపోహలకు పోయి మానసిక ఒత్తిడికి గురికావద్దుని,కరోనా బాధితులకు ఆత్మస్థైర్యం పెంపొందించడమే దివ్యౌషధం అని కరోన సోకిన  కుటుంబాలకు ఇరుగు పొరుగు కుటుంబాలు ఆసరాగా నిలవాలని వారికి కావలసిన చిన్న చిన్న అవసరాలు సమకూరుస్తూ వారిలో మనము ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తే ప్రతి ఒక్కరు కరోనాను సమర్థవంతంగా జయించవచ్చుని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ ఉద్యోగ సంఘాల నాయకులు ఆఫీజ్ మియా, జూలూరుపాడు  మండల అధ్యక్షుడు సున్నం కరుణాకర్, పుల్లారావు, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: