మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని పడమట నర్సాపురం గ్రామపంచాయతీలో బుధవారం అవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని డి ఆర్ డి ఓ మరియు ప్లాంటేషన్ స్పెషల్ అధికారి మధుసూదన్ రాజు మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొక్కకు కావలసిన కంపోస్ట్ ఎరువులను, అందిస్తున్నామన్నారు. చీమలు, చెదపురుగులు, మొక్కలకు హాని కలిగించకుండా ఉండేందుకు అవసరమైన మందులను పాదు లోనే చల్లి ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారి జె మరియన్న, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎం పి ఓ రామారావు, సర్పంచ్ కట్రం మోహనరావు, కాజా రమేష్, ఏ పీ ఓ జమీర్ పాష, కార్యదర్శి ఇస్మాయిల్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: