CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మా భూమి పట్టాలు మాకు ఇప్పించండి

Share it:

 


 తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చర్ల


 మన్యం టీవీ చర్ల:

53 వ  సర్వే నెంబర్ లోని మా పట్టా భూమి మాకు చూపించి ఇవ్వాలంటూ చర్ల మండలం  విజయ కాలనీ గ్రామ  గిరిజన ప్రజలు స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ముట్టడి  చేయడం జరిగింది.  ఈ సందర్భంగా  సీపీఎం చర్ల మండలం  నాయకుడు కొండా చరణ్, మాట్లాడుతూ 2000 సంవత్సరం నుంచి చెట్టు కొట్టి పుట్ట కొట్టి భూమిని చదును చేసుకొని అట్టి భూమికోసం కేసులు అయినా జైలుకెళ్లి నాటి ప్రభుత్వంతో దెబ్బలాడి   2007 లో ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా పట్టాలని ఈ గిరిజనులు సాధించుకోవడం జరిగింది. నాడు అట్టి భూమిలో టేకు చెట్లు నాటడం, ఉపాధి హామీ పథకం ద్వారా అట్టి భూమిలో ని ఎత్తుపల్లాలను చదును చేయించడం జరిగింది. నాటి నుండి నేటి వరకు ఆ భూమిలో నీళ్లు లేకటేకు మొక్కలు బ్రతక న ప్పటికీ పట్టుదలతో మొక్కలు  వేస్తూన్నారు. అట్టి భూమిని కి తెలంగాణ ప్రభుత్వం నుండి పట్టాలు మంజూరు చేయడం జరిగింది. అంతేకాకుండా రైతు బంధు పథకం కూడా అందించడం జరుగుతుంది ఇప్పుడు ఆ భూమిని ఈ గిరిజనులది కాదు అని రెవెన్యూ వారు  అనడం అత్యంత దుర్మార్గమని అన్నాడు. ఇది గిరిజనుల పొట్ట మీద కొట్టడం అని విమర్శించారు. గిరిజనులకు ఇచ్చిన 53 సర్వే నెంబర్ లో ఉన్న 16 ఎకరాల  భూమిని సర్వే నెంబర్ 1 గా మార్చి ఆ భూమిని ఏకలవ్య స్కూలు కు కేటాయించడం గిరిజనులను మోసం చేయడమేనని అన్నాడు. ఈ భూమి వాళ్ళ కానప్పుడు మరి గిరిజనుల భూమి అంటున్నా 53 సర్వే నెంబర్ లోని భూమి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఇదేనా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు వారి భూములకు కల్పించే రక్షణ అని అన్నారు. రెవెన్యూ వారు చేసిన తప్పిదానికి గిరిజనులను బలిచెయ్యడం సమంజసం కాదని దీని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇప్పటికి పది రోజులుగా 53 సర్వే లేని భూమి ఎక్కడ ఉందని సర్వీస్ చెయ్యమని  స్థానిక రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలతో మొరపెట్టుకున్నా ఈ గిరిజనుల భూములు ఎక్కడ ఉన్నాయో 53 సర్వే నెంబరు లోని భూమి ఎక్కడ ఉందో చూపే  నాథుడే  కరువయ్యారని, ఏ రోజుకారోజు సర్వే చేస్తామంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారాని, గిరిజనులు అంటే కనీసం లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారని ఈ పద్ధతి ఏజెన్సీ ప్రాంతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఏ మాత్రం మంచిది కాదని హెచ్చరించారు. తక్షణం మా గిరిజనులు  భూమి ఎక్కడుందో తాసిల్దార్ తక్షణం చూపిస్తే తప్పా ఇక్కడి నుంచి వెళ్ళ మంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇన్ని రోజులుగా గిరిజనులు ఇంత ఇబ్బంది పడుతున్నా ఐటీడీఏ అధికారులు స్పందించకపోవడం  అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు. ఈ వివాదంలో  స్థానిక పోలీసు అధికారి ఎస్ ఐ వెంకటప్పయ్య  పాల్గొని జోక్యం చేసుకొని ఎమ్మార్వో తోటి ప్రజల తోటి సంప్రదింపులు జరిపి పరిష్కారం చేయాలని ప్రయత్నం చేయగా ఆ చర్చలు విఫలం అయ్యాయని, 53 లోని మా గిరిజనుల  భూమిని సర్వే చేసేదాకా మేము ఇక్కడి నుంచి వెళ్ళమని, సర్వే చేసి ఆ భూమిని ఇచ్చేదాకా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని ఎమ్మార్వో కార్యాలయం ముందు టెంటు వేసి కూర్చోవడం జరిగినది. ఇప్పటికైనా  53 సర్వే నెంబర్ లోని గిరిజనుల భూముల్ని  సత్వర గా సర్వే చేపించి వారి యొక్క 16 ఎకరాల భూమిని వాళ్లకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు లేనియెడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గిరిజన భూమి పోరాటాన్ని లేవనెత్తుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో సీపీఎం పార్టీ నాయకులు మచ్చా రామారావు,మహిళాసంఘం నాయకులు పొదుపుగాంటి. సమ్మక్క, సిపిఎం విజయకాలనీ శాఖ కార్యదర్శి వరదల వరలక్ష్మి, పాలక సూరమ్మ డబ్బుల మాహాలక్ష్మి, గొల్ల వీరబాబు, గడపా లక్ష్మి, బొర్రమ్మ జగ్గం రాజు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: