CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలంగాణ ముఖ్యమంత్రి రైతు బాంధవుడు

Share it:

 



రైతు వేదికలు- రైతుల ప్రయోజనార్థమే


పినపాక రైతు వేదిక ను ప్రారంభించిన ఎంపీపీ


పినపాక రైతు వేదిక ప్రారంభోత్సవంలో పాల్గొన్న రేగా


మన్యం మనుగడ, పినపాక:


 తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రయోజనార్థం చేపట్టిన రైతు వేదికలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. బుధవారం నాడు పినపాక మండల కార్యాలయానికి సమీపంలోగల రైతు వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమం మండల ఎంపిపి గుమ్మడి గాంధీ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రేగా కాంతారావు హాజరైనారు. ముందుగా ఎమ్మెల్యే పినపాక గ్రామంలోని డంపింగ్ యార్డ్, వైకుంఠధామం లను ప్రారంభించారు. రైతు వేదిక ప్రారంభోత్సవాన్ని ఎమ్మెల్యే రేగా కాంతారావు పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ చేతులమీదుగా జరిపించారు. అనంతరం రేగా కాంతారావు మాట్లాడుతూ, రైతు వేదికలు రైతుల ప్రయోజనార్థం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేసిందని, రాజకీయ ప్రమేయం లేకుండా రైతులందరూ  వారి వారి పొలాల్లో వేసుకునే పంటల వివరాలు గురించి ఈ ప్రదేశంలో చర్చించుకుని ఫలితాలను పొందే అవకాశం ఉందని తెలియజేశారు.  భవిష్యత్తులో పంటలకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ సంబంధిత అధికారులతో, రాష్ట్ర పాలక వర్గంతో కూడా మాట్లాడి పంటలు వేసే విధానాన్ని గురించి తెలుసుకోవచ్చునని తెలియజేశారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయితీ సర్పంచులు ఎటువంటి  నిర్లక్ష్యం వహించకుండా గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, మండల వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ రవి వర్మ, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, ఆత్మ చైర్మన్ భద్రయ్య, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు దాట్ల వాసు, బొలిశెట్టి నరసింహారావు, కూనారపు రాము, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు, తహసిల్దార్ వెంకట విక్రమ్ కుమార్,  వ్యవసాయ శాఖ ఏడి తాతారావు, ఏవో వెంకటేశ్వర్లు, విస్తరణాధికారి లక్ష్మణరావు, పినపాక సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు, వివిధ గ్రామాల సర్పంచులు, రైతులు పాల్గొన్నారు

Share it:

POLITICS

Post A Comment: