CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే గుత్తికోయ ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయం.

Share it:


👉భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్.

👉కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీ గిరిజనులకు 2500 వాటర్ ఫిల్టర్లను మరియు 66 టీవీలను అందజేసిన జిల్లా పోలీసు అధికారులు.

మన్యం టీవీ కొత్తగూడెం ప్రతినిధి:-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన చర్ల,దుమ్ముగూడెం,గుండాల,ఆళ్లపల్లి,బోడు, కరకగూడెం,కోమరారం,ఏడూళ్ల బయ్యారం మొదలగు ప్రాంతాల్లో నివసించే గుత్తికోయ ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలను సమకూర్చడమే జిల్లా పోలీసులు ధ్యేయం అని జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలియజేసారు.కనీస సౌకర్యాలు లేకుండా ఇబ్బందులకు గురవుతున్న గుత్తికోయ గ్రామాలను గుర్తించి వారికి అన్ని రకాల సౌకర్యాలను సమకూర్చడానికి జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు.

త్రాగడానికి స్వచ్ఛమైన నీళ్లు లేక వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న గుత్తి కోయ గ్రామాలను గుర్తించి అక్కడ నివసించే ప్రజలకు ఇంటికొక్క వాటర్ ఫిల్టర్ చొప్పున ఇప్పటివరకు 2500 ఫిల్టర్లను పోలీసుశాఖ తరపున అందజేయడం జరిగిందన్నారు.

ఏజెన్సీ ప్రాంతాల్లోని యువతకు మరియు ప్రజలకు సమాజంలోని ప్రస్తుత పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలు కల్పించే ప్రయత్నంలో భాగంగా 66 TV లను Tata sky సెట్ అప్ బాక్సులతో సహా గుత్తి కోయ గ్రామాల్లో అమర్చడం జరిగిందని తెలియజేసారు.ఇట్టి వాటర్ ఫిల్టర్లు మరియు TV లను జిల్లాలోని ఎస్సైలు,సిఐలు,డీఎస్పీలు మరియు ఏఎస్పీల ద్వారా వారికి అందజేయడం జరిగిందని తెలియజేసారు.

మావోయిస్ట్ ప్రభావిత ప్రాంత ప్రజలు మరియు యువత మావోయిస్టులలో చేరరని మాకు పూర్తి నమ్మకం ఉందని ఎస్పీ ఈ సందర్భంగా తెలియజేసారు. మన జిల్లాలో మావోయిస్టులకు ఏజెన్సీ ప్రాంత ప్రజల ఏ విధమైన మద్దతు లేదని ఇప్పటికే మనము చూస్తున్నామని అన్నారు.

ఏజెన్సీ ప్రాంత పోలీసు స్టేషన్లలో పనిచేసే స్థానిక పోలీసు అధికారులు నిత్యం గుత్తికోయ గ్రామాల్లో సంచరిస్తూ వారి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నారని వారు తెలియజేశారు.

Share it:

Post A Comment: