అవార్డు అందజేసిన డిజిపి మహేందర్ రెడ్డి
గుండాల ఆళ్ల పల్లి జూన్ 29 (మన్యం టీవీ) సేవలలో ఆళ్ల పల్లి ఎస్ఐ సంతోష్ భేష్. ఆళ్ల పల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ విధులు నిర్వహిస్తున్న సంతోష్ ఉత్తమ సబ్ ఇన్స్పెక్టర్ గా అవార్డును డిజిపి మహేందర్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. గతంలో రఘునాథ పాలెం ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఎన్నికయ్యారు అవార్డును డీజీపీ చేతుల మీదుగా ఆయన తీసుకున్నారు. ఆళ్ల పల్లి ఎస్ ఐ గా విధులు చేపట్టిన నాటినుండి మండలంలో కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి ఆదరాభిమానాలను చూరగొంటున్న రు. గత నెలలో కరోనా బారిన పడి చనిపోయిన వారిని కుటుంబ సభ్యులు దహన సంస్కారాలు నిర్వహించకపోవడంతో తానే పీ పీ కిట్టు ధరించి దహన సంస్కారాలను నిర్వహించారు
Post A Comment: