CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇండియన్ కిసాన్ యూనియన్ తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ కి సమస్యలు పరిష్కరించాలని మెమోరాండం ఇచ్చిన బాధిత రైతులు.

Share it:

 


మన్యం మనగడ,ములకలపల్లి:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతారాంపురం పంచాయతీ గుర్రాలకుంట చింతలపాడు ధర్మానగర్ గ్రామాలకు చెందిన గిరిజన రైతులు సుమారు 170 మంది వాళ్లు సాగు చేస్తున్నటువంటి 350 ఎకరాల భూములకు రక్షణ కల్పించాలని గత 20 సంవత్సరాలుగా సాగుచేస్తున్న పోడు భూములకు ఫారెస్ట్ అధికారుల నుంచి ఇబ్బందులు కలగకుండా చూడాలని భూములు తప్ప ఇతర ఆధారం లేదని గిరిజన అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టా హక్కులు కల్పించే విధంగా సంబంధిత రెవెన్యూ అధికారులు తోని సంబంధిత ఫారెస్ట్ అధికారులు తోని ఐ కే యు ఇండియన్ కిసాన్ యూనియన్ తరపున మాట్లాడి పట్టా హక్కులు కల్పించాలని ఫారెస్ట్ అధికారులు నుండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని  భూపరిపాలన కమిషన్ , ఎస్సీ ఎస్టీ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను

*1) Hon'ble High Court Order in WP No. 6360/2020, dt.20/04/2020

*2)CCLA File No.2/386/2020, dated 29/12/2020

*3)SC-ST Commission Lr.No.5453/004249/2019, dated 06/11/2019

*4)Lr.No.C2/10/21/2015, dt.31/01/2020 of District Collector,Bhadradri-Kothagudem district* *5) Notice Rc.No. TSC/S3/004249/BKGM-L/2019, dated 20/03/2021 of Telangana State Commission for SC's and ST's.

అధికారులు ఇంప్లిమెంట్ చేయాలని ఈరోజు 70 మంది రైతులు ఐ కే యు ఇండియన్ కిసాన్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ మద్దిశెట్టి సామేలు కోరడం జరిగింది.  దమ్మపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి, ములకలపల్లి ఎమ్మార్వో   మాట్లాడి మీ సమస్యకు పరిష్కారం చూపిస్తానని రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 కంటే ముందు నుంచి మీరు సాగులో ఉన్న మాట వాస్తవం అయితే మీకు న్యాయం జరిగేలా చూస్తామని రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు ఇనపనూరి నవీన్, గిరిజన రైతుల నుండి తాటి రాజు తదితరులు పాల్గొన్నారు.పేద రైతులు అందరు కూడా ఇండియన్ కిసాన్ యూనియన్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 

Share it:

TELANGANA

Post A Comment: