CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఫస్ట్ డోస్ వేశారు సెకండ్ డోస్ మరిచారు

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

దేశ వ్యాప్తంగా మొదలైన వాక్సిన్నేషన్ ప్రక్రియ ఆరంభం అంబరాన్ని అంటింది. కరోనా వాక్సిన్ భారత్ లో మొదటి రోజు1.91లక్షల మందికి కోవిడ్ టీకాలు వేశారు కానీ ఆచరణలో మరుసటి రోజునుండి వాక్సిన్ కొన్నిచోట్లా దొరకని పరిస్థితి, వాక్సినేషన్ నడిచే చోట్ల నత్త నడకన నడుస్తుంది. ఇప్పటివరకు కనీసం మొదటి డోస్ వేయలేదు.  వాక్సినేషన్ ప్రక్రియ తెలంగాణ లో ఎక్కడ  వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. ఫస్ట్ డోస్ వాక్సిన్ వేసిన వారికి సెకండ్ డోస్ ఎప్పుడు వేస్తారో తెలియని పరిస్థితి. ఫస్ట్ డోస్ వేసే టప్పుడు 24 లేదా 28రోజుల్లో సెకండ్ డోస్ వేస్తామన్నారు. ఇప్పుడు 84రోజుల తర్వాత కోవిషిల్డ్ సెకండ్ డోస్        వేస్తామన్నారు కొంతమందికి 84రోజులు గడిచినా కూడా సెకండ్ డోస్ వేయని పరిస్థితి.కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు రెండవ డోస్ ప్రజలకు ఎప్పుడు ఇవ్వాలో తెలియని డైలామాలో ఉన్నారు. సెకండ్ డోస్ ఎప్పుడు వేస్తారో తెలియదు, వేసిన ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ మధ్య వ్యవధి పెరిగితే వాక్సిన్ పనిచేస్తుందో లేదో ఇటువంటి గంధరగోళం ల మధ్య కొంతమంది వాక్సిన్ గురించి సెకండ్ డోస్ ఎప్పుడు ఇస్తారు అని డాక్టర్స్ ను అడగ్గా మాకు పై అధికారులనుండి ఎటువంటి సమాచారం వేయమని ఆదేశాలు రాలేదు, వాక్సిన్ లేదు అంటున్నారు. ఇటువంటి జాతీయ విపత్తు పరిస్థితిలో వాక్సినేషన్ ప్రక్రియ లో గంధరగోళం  కొంతమందికి  ముఖ్యంగా నిరక్షరాస్యులవారికి ఏ వాక్సిన్ వేయించుకున్నారో తెలియదు, మొబైల్స్ లేవు, కొంతమందికి మెసేజ్ లు రాలేదు, ఇటువంటి అయోమయంలో కొంతమంది కొట్టుమిట్టడుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లుతెరిచి ప్రజా సంక్షేమం దృష్ట్యా ఫస్ట్ డోస్ వాక్సినేషన్ పూర్తి చేసుకున్నవారికీ సెకండ్ డోస్ కూడా ఇచ్చి 18 నుండి 45 వారికి కూడా వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయవలసిన అవసరం ఉంది. మన ముందున్న సవాళ్లు వర్షకాలం లో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ ఇటువంటి తరుణంలో ఒక పక్క కరోనాను కట్టడి చేస్తూ,మరొకపక్క వాక్సిన్ నేషన్ ను అన్ని వయసులవారికి రెండు డోసులు అందించి కనీసం వచ్చే సంవత్సరం నాటికైనా కరోనా రహిత సమాజం లో నివసించే పరిస్థితి రావాలని ప్రజలు ఆశిస్తున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: