కొత్తగూడెం డివిజన్ పంచాయతీ అధికారి హరి ప్రసాద్
గుండాల (మన్యం టీవీ)పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని కొత్తగూడెం డివిజన్ పంచాయతీ అధికారి హరి ప్రసాద్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఆయన పర్యటించారు. మండలంలోని కాచన పల్లి, మామ కన్ను , మూతపురం , గుండాల ,సాయనపల్లి, పంచాయతీల్లో పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంచాయితీల్లో అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యం పనులు చేపట్టాలని ఆయన సూచించారు. పారిశుద్ధ పనులను ముమ్మరం చేయాలన్నారు. అలసత్వం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. పంచాయితీల్లో నిర్మించిన డంపింగ్ షెడ్లు వైకుంఠ దమూలను ఆయన పరిశీలించారు. సర్పంచులు కార్యదర్శులు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. పారిశుద్ధ్య పనుల్లో సర్పంచులు కార్యదర్శులు ముఖ్య భూమిక పోషించాలని వారిని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు సైడ్ కాలవలో పూడికతీత చేపట్టాలని మురికి నీరు ఉండకుండా చూడాలన్నారు దానితోపాటు రహదారులకు ఇరువైపుల పిచ్చి మొక్కలు లేకుండా శుభ్రపరచాలి అని ఆయన అధికారులను ఆదేశించారు. వీటితో పాటు రెవిన్యూ ప్లాంటేషన్ పనులను ముమ్మరం చేయాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హజరత్ హోలీ, సర్పంచులు సీతారాములు ,సమ్మయ్య ,ముత్యమా చారి ,లక్ష్మీ నర్సు ,కార్యదర్శులు సురేష్ ,నరేష్ ,అఖిల్ ,జ్యోతి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: