CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి క్రిమినల్ కేసులను నమోదు చేయాలి

Share it:


👉ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్.

👉వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్.


జిల్లాలో రైతులకు నష్టం కలిగించే విధంగా ఎవరైనా నకిలీ విత్తనాలను,అనధికారిక విత్తనాలను విక్రయించే వారిని ఉపేక్షించేది లేదని,సంబంధిత డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ ఈ రోజు జిల్లా పోలీసు అధికారులందరికి అదేశాలు జారీచేశారు.

జిల్లాలో నకిలీ విత్తనాలను పూర్తిస్థాయిలో రూపుమాపడంపై తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా ఎస్పీ 

పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 


ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గత ఐదేండ్లుగా విత్తనాలు కొనుగోలు చేసి వేసిన పంటకు దిగుబడి రాక నష్టపోయిన రైతులు అదే విధంగా నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులు జిల్లాలో ఎవరైనా ఉన్నా,అలాగే ప్రస్తుత పరిస్థితులలో జరుగుతున్న నకిలీ మోసాలపై వాట్సాప్ ద్వారా గానీ ఫోన్ చేసి గానీ *8978072286* నెంబర్ కు సమాచారం అందిచాలని ఎస్పీ కోరారు.అదేవిధంగా నకిలీ విత్తనాలను విక్రయించి అరెస్ట్‌ అయినవారి వివరాలు,నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులు,పంట నష్టం,విక్రయదారుల సమాచారాన్ని సేకరించి ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.నకిలీ విత్తనాల తయారీదారులు,మార్కెటింగ్‌, స్థానిక నెట్‌వర్క్‌ తదితర వివరాల నిర్వహణ విధానాన్ని (మోడస్‌ ఆపరెండీ) రూపొందించి కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. 


నకిలీ విత్తనాలను విక్రయించేందుకు ఆయా గ్రామాలకు వచ్చే ఏజెంట్లపై దృష్టి సారించి వారి సమాచారాన్ని సేకరించాలని సూచించారు.ఇందుకు స్థానిక పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. 

జిల్లా సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద వ్యవసాయశాఖ అధికారుల తోడ్పాటుతో పోలీసు శాఖ కట్టుదిట్టమైన నిఘా చర్యలు చేపట్టాలని సూచించారు.

నకిలీ విత్తనాలను నిరోధించడానికి జిల్లా వ్యాప్తంగా ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు.ఇందులో భాగంగా జిల్లా మరియు మండల స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ప్రత్యేకంగా నియమించామని తెలియజేసారు.

Share it:

Post A Comment: