CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

ములుగు జిల్లా కేంద్రంలో వివిధ కార్యాలయాలలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా పరిషత్ కార్యాలయంలో ములుగు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కుసుమ జగదీష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ప్రసన్న రాణి, మండలాల జడ్పీటీసీలు కో-ఆప్షన్ నెంబర్ లు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార స్వామి జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేంద్ర గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి భగవాన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోతు రవి చందర్, మండల అధ్యక్షుడు ఎండి చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నందు రాష్ట్ర అవతరణ వేడుకలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అల్లేం అప్పయ్య జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలను అనుసరించి అవతరణ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. అలాగే ములుగు జిల్లా లో కరోనా వైరస్ నిర్మూలనకు నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. జిల్లా ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ డాక్టర్స్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: