CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

కొనసాగుతున్న కంది సుబ్బారెడ్డి సాయం

Share it:

 



మన్యం మనుగడ, పినపాక: మండలంలోని ఏడూళ్ల బయ్యారం పంచాయతీకి చెందిన పినపాక మండల వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి కరోనా రోగులకు అందించే సాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆదివారం రోజున పినపాక మండలం లోని సీతంపేట, భూపాలపట్నం, గడ్డం పల్లి , పొట్లపల్లి పంచాయతీల లో సుమారు 30 కరోనా రోగుల కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేయడం జరిగింది. కంది సుబ్బారెడ్డి చేస్తున్న సేవ పట్ల మండలంలోని పలువురు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇప్పటికే మండల వ్యాప్తంగా గల 23 పంచాయతీలలో దాదాపు 10 పంచాయతీలకు పైగా రెండు నుంచి మూడుసార్లు నిత్యావసర సరుకులను అందించడం జరిగింది. ఇటీవల మన్యం మనుగడలో కంది సుబ్బారెడ్డి చేసిన సేవ "ప్రాణదాత " అనే పేరుతో వ్యాసం ప్రచురితం కావడం జరిగింది. కారణం కరోనా రోగులకు ఆక్సిజన్ అందించే ఉద్దేశంతో ఆక్సిజన్ కాన్సెంట్రేట్ లను పినపాక, జానంపేట, కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆయా పంచాయతీల సర్పంచులు, ప్రజలు పాల్గొనడం జరిగింది

Share it:

TELANGANA

Post A Comment: