మన్యం టీవీ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం మండలం రొయ్యూరు గ్రామంలో మిషన్ భగీరథ పంప్ హౌస్ వెనుక రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా బురదమయం కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని రొయ్యూరు గ్రామ ప్రజలు ములుగు జిల్లా టిఆర్ఎస్ పార్టీ నాయకులు కాకులమర్రి లక్ష్మీ నరసింహారావు (లక్ష్మణ్ రావు)కు తెలియజేశారు. వెంటనే కాకుల మర్రి లక్ష్మణ్ బాబు స్పందించి సొంత ఖర్చులతో కంకర రోడ్డు వేయడం జరిగింది. దీంతో రొయ్యూరు గ్రామస్థుల తోపాటు రాకపోకలు సాగించే వాహనదారులు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ నాయకుడు అంటే ఇలా ఉండాలని అని సమస్య ఉందని తెలిసిన వెంటనే స్పందించే గుణం ఉండాలని స్థానిక ప్రజల కష్టాలు తీర్చే లక్ష్మణ బాబుకు మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
Post A Comment: