CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

డాక్టర్ నిర్లక్ష్యం వలన గర్భిణీ స్త్రీ మరణించిందని బంధువులు ఆందోళన,దుమ్ముగూడెం

Share it:

 



మన్యం టీవీ దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలం ఆర్లగుడెం గ్రామపంచాయతీ రేగుంట గ్రామం నికి చెందిన పాయం ఎర్రయ్య కూతురు పునెం సమ్మక అనే గర్భిణీ స్త్రీకి నొప్పులు రావడంతో మండలంలోని గవర్నమెంట్ హాస్పటల్ కు తీసుకెళ్లడం జరిగింది. నొప్పులతో బాధపడుతున్న ఆ గర్భిణీ స్త్రీ కు డాక్టర్ బాలాజీ నాయక్ ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీయడం జరిగింది. అదే సమయంలో రక్త ప్రసవం ఎక్కువగా జరగడం వలన ప్రమాదకరం పరిస్థితి ఉన్నందువలన భద్రాచలం గవర్నమెంట్ హాస్పటల్ కు తీసుకెళ్ళమని వారి బంధువులకు చెప్పడం జరిగింది. వారు అక్కడి నుంచి 108 వాహనంలో మార్గమధ్యంలో గర్భిణీ స్త్రీ కు అధిక బ్లీడింగ్ అవ్వడం వలన హాస్పిటల్ కు చేరుకునే లోపే తను మరణించడం జరిగింది. ఈ నిర్లక్ష్యానికి కారణం దుమ్ముగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ బాలాజీ నాయక్ అజాగ్రత్త నిర్లక్ష్యం వలన తను చని పోయిందని వారి బంధువులు హాస్పిటల్ వద్ద ఆందోళన చేశారు. అక్కడ ఉన్న మన్యం టీవీ ప్రతినిధి డాక్టర్ను ప్రశ్నించగా ఈ  గర్భిణీ  పూనెం సమ్మక్క ను మంగళ మంగళవారమే హాస్పిటల్కు తీసుకు రాగా పరీక్షించిన తరువాత గర్భాశయంలో బిడ్డ ఎదురుకాళ్ళతో ఉండడంతో ఈ ఆస్పటల్ లో సాధారణ ప్రసవం చేయడం కష్టమని ప్రమాదంతో కూడుకున్నదని, ఆపరేషన్ చేయవలసి వస్తుందని వెంటనే భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్ కు108 వాహనంలో పంపించడం జరిగింది. పురిటి నొప్పులతో అదేరోజు ఆ గర్భిణీ స్త్రీని సాయంత్రం మూడు యాభై నిమిషాలకు మరలా హాస్పిటల్కు తీసుకు రావడం జరిగింది. మరలా మీరు ఎందుకు ఈ పి హెచ్ సి హాస్పిటల్ తీసుకొచ్చారని కుటుంబ సభ్యులను ప్రశ్నించగా  భద్రాచలం ఏరియా ఆస్పటల్ కు పరీక్షించి ప్రసవానికి ఇంకా సమయం పడుతుందని చెప్పి తిరిగి పంపించారని వారు తెలియజేయడం జరిగింది. వెంటనే గర్భిణీ స్త్రీ ని పరీక్షించగా బిడ్డ యొక్క రెండు కాళ్ళు బయటికి రావడంతో అత్యవసర పరిస్థితిలో కుటుంబసభ్యులకు సాధారణ ప్రసవం నిర్వహిస్తే జరిగే ప్రమాదం గురించి తెలియజేసి, సాధారణ ప్రసవం నిర్వహణ బిడ్డను బయటకు తీయడం జరిగింది. ప్రసవం తర్వాత తల్లి బిడ్డ పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర చికిత్స చేసి స్టాఫ్ నర్స్ సహాయంగా ఇచ్చి 108 వాహనంలో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇందులో పీహెచ్సీ వైద్యాధికారి గాని వైద్య సిబ్బంది యొక్క ఎటువంటి నిర్లక్ష్యం లేదని తెలియజేయడం జరిగింది.  అని డాక్టర్ బాలాజీ మన్యం టీవీ ప్రతినిధి కి తెలియజేయడం జరిగింది.

Share it:

TELANGANA

Post A Comment: