CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సర అడ్మిషన్లు ప్రారంభం

Share it:

 




 మన్యం టీవీ చర్ల:

చర్ల స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు 2021 - 2022 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్లు ప్రారంభమైనవని  ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బండి సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల కారణంగా వారి ఇంటి వద్ద నుండే ఆన్ లైన్ ద్వారా ప్రవేశము పొందవచ్చును. కళాశాలలో జనరల్ విభాగంలో ఎంపీసీ, బి పి సి, సీఈసీ మరియు హెచ్ ఈసీ కోర్సు లు కలవు, అదేవిధంగా గా ఒకేషనల్ విభాగము నందు ఓ ఏ ఎస్, ఈ టి, ఎం టి,  టి అండ్ హెచ్ ఎం,         ఎం ఎల్ టి మరియు ఎమ్ పి హెచ్ డబ్ల్యు  కోర్సులు కలవు.              ఈ కోర్సులలో చేరబోయే విద్యార్థులు www.tsbie.gov.in వెబ్సైట్ ద్వారా  అడ్మిషన్ ని పొందవచ్చు.

 ఎంతో అనుభవం ఉన్న ఉత్తమమైన అధ్యాపకులచే విధ్యా బోధన,  అనువైన తరగతి గదులు మరియు ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ ల్యాబ్ లు, సురక్షితమైన త్రాగునీరు సౌకర్యం మరియు అన్ని విధాలైన సౌకర్యాలు ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు కలవని, గత 10 సంవత్సరములు గా ఉత్తమమైన ఫలితాలను సాధిస్తూ గత సంవత్సరం అనగా మార్చి 2020 ఫలితాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల పరంగా రాష్ట్రస్థాయిలో మూడవ స్థానంలో నిలిచి జిల్లాకే గర్వకారణంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల, చర్ల నిలిచినది  కావున ప్రస్తుత ఈ పరిస్థితులలో దూరంగా ప్రైవేట్ కళాశాల లో చేరి ధనము , ఆరోగ్యము నష్టపోకుండా స్థానికంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల, చర్ల నందు చేరి ఉజ్వల భవిష్యత్తును తీర్చి దిద్దు కోవాల్సింది గా విద్యార్థులను , విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను కళాశాల ప్రిన్సిపాల్    విజ్ఞప్తి చేశారు. వివరాలకు 9177970369, 8099529699, 9397316143, 9951193584 నంబర్లను సంప్రదించాల్సినదిగా ఆయన కోరారు.

Share it:

TECHNOLOGY

Post A Comment: