గుండాల (మన్యం టీవీ) మండల కేంద్రంలో గురువారం దోమ తెరలను ఎంపీపీ ముక్తి సత్యం, గుండాల ఎంపీటీసీ ఎస్కే సంధాని దోమ తెరలను పంపిణీ చేశారు, అనంతరం వారు మాట్లాడుతూ వర్షాకాలంలో దోమలతో అనేక వ్యాధులు వ్యాప్తి చెందుతాయని వాటినుండి రక్షణ కొరకు దోమతెరలు ఉపయోగపడతాయన్నారు. సీజనల్ కాలం ప్రారంభమై నందున ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్నారు. ఇంటి చుట్టూ నీళ్లు నిలవకుండా ఉండేలా చూసుకోవాలన్నారు. పాత టైర్లలో కూలర్ల లో నీళ్లు నిల్వ ఉన్నట్లయితే దోమలు గుడ్లు పెట్టి వ్యాప్తి చెందే ప్రమాదముందన్నారు. ప్రతి ఒక్కరూ దోమ తెరలను వినియోగించుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో గుండాల సర్పంచ్ కోరం సీతారాములు, పంచాయతీ సెక్రెటరీ సురేష్, మలేరియా టెక్నికల్ సూపర్వైజర్ సత్యం , కారోబార్ నాగరాజు , గ్రామస్తులు ,వై వెంకన్న ,ఈసం కృష్ణ ,గడ్డం కృష్ణ ,లాలూ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: