; పని కల్పిస్తామని భూమిని తీసుకున్నారు నిర్మాణం పూర్తయ్యాక ముఖం చాటేశారు
; మిషన్ భగీరథ ఉన్నత అధికారులు స్పందించాలని బాధితుల వినతి
గుండాల ఆళ్ల పల్లి ( మన్యం టీవీ) సారూ మా గోడు పట్టించుకోరా అంటూ మిషన్ భగీరథ ట్యాంకు నిర్మాణం కోసం భూమిని ఇచ్చిన నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని కల్పిస్తామని భూమిని తీసుకొని నిర్మాణం పూర్తయ్యాక ముఖం చాటేశారు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మిషన్ భగీరథ ఉన్నత అధికారులు స్పందించి న్యాయం చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఆళ్ల పల్లి మండలం పరిధిలోని మర్కోడు గ్రామానికి చెందిన అంజొజు తిరుపతమ్మ పట్టా భూమి లో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ను నిర్మించారు నిర్మించే సమయంలో ఇంట్లో ఒకరికి పని కల్పిస్తామని హామీ ఇచ్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత అధికారుల చుట్టూ ఎన్నిమార్లు తిరిగిన పని కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఆళ్ల పల్లి మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. తిరుపతమ్మ భర్త మరణించడంతో ఇద్దరు పిల్లలను కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది మిషన్ భగీరథ లో పని కల్పిస్తారు అన్న ఆశతో నిర్మాణం కోసం భూమి ఇచ్చామని తిరుపతమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ భూమిని ఎవరికైనా అమ్ముదాం అంటే కొనటానికి ఎవరు సైతం ముందుకు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని తాసిల్దార్ కు వినతి పత్రాన్ని సమర్పించామన్నారు. లేనిపక్షంలో మిషన్ భగీరథ అధికారులపై న్యాయపోరాటం చేస్తామని బాధితులు వినతి పత్రం లో పేర్��
Post A Comment: