CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బంకించంద్ర ఛటర్జీ జయంతిన ఘన నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు

Share it:

 


మన్యం మనుగడ ,మణుగూరు:


ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు గారు మాట్లాడుతూ బంకించంద్ర చటోపాధ్యాయ పేరు తెలియని భారతీయుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. వందేమాతరం గీత రచయితగా ఆయన యావత్భారతావనికి సుపరిచితులే. ఆయన రచయిత, కవి, పాత్రికేయుడు. ఆయన వందే మాతరం మొదట సంస్కృత స్తోత్రంలో భారత దేశాన్ని మాతృదేవతగా వ్యక్తీకరించారు. ఆ గీతం ద్వారా భారత స్వాతంత్ర్య సమయంలో కార్యకర్తలను ప్రేరేపించారు. బంకించంద్రుడిలో మాతృ దేశాభిమానం, దేశ భక్తి అనంతం, అపూర్వం. ఆధునిక భారతీయ సాహిత్య చరిత్రలో బంకించంద్ర చటర్జీ అగ్రగణ్యులలో ఒకరు. ఒక్క బెంగాలీ సాహిత్యాన్నే కాక సమస్త భారతీయ సాహిత్యాలను ఆయన పంతొమిదో శతాబ్ది ఉత్తరార్దంలో, ఇరవయ్యో పూర్వార్దంలో అంటే సుమారు ఒక శతాబ్దం పాటు ప్రభావితం చేసారు. ప్రపంచ సాహిత్య చరిత్రలో జాతుల విముక్తి పోరాటాలలో, స్వాతంత్ర్య సమర చరిత్రలో ఒక మహా కవి రచించిన దేశభక్తి గీతం తన జాతి జనులను ఉత్తేజపరిచి, ఉద్యమింప చేసిన సంఘటన, బంకించంద్రుడి విషయంలో లాగ మరొక దేశంలో, మరొక దేశ చరిత్రలో చోటు చేసు కోలేదనేది వాస్తవమని అన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: