CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇద్దరు మావోయిస్ట్ మిలీషియా సభ్యులను అదుపులోకి తీసుకున్న చండ్రుగొండ పోలీసులు

Share it:

 


👉వివరాలను వెల్లడించిన కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వర బాబు

మన్యం టీవీ కొత్తగూడెం, జూన్ 28:-

నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ జేగురుగొండ ఏరియా కమిటీకి అనుబంధంగా పనిచేస్తూ మిలీషియా కమిటీలో పని చేస్తున్న ఇద్దరు సభ్యులను చండ్రుగొండ పోలీసులు అరెస్టు చేసినట్లుగా కొత్తగూడెం డిఎస్పీ జి.వెంకటేశ్వర బాబు వెల్లడించారు. నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో చంద్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోకలగూడెం గ్రామశివార్లలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులను చూసి ఇద్దరు వ్యక్తులు పారిపోతుండగా వారిని వెంబడించి పట్టుకోవడం జరిగిందని తెలిపారు. అనంతరం వారిని విచారించగా మావోయిస్టు మిలీషియా కమిటీ సభ్యులుగా తెలిసిందని వెల్లడించారు.

పట్టుబడిన ఇద్దరు మావోయిస్ట్ మిలీషియా సభ్యుల వివరాలు

1)హేమ్లా ఐతు, సన్నా/ఫ్.పాండు,వయసు:24 సంవత్సరాలు,తెర్రం గ్రామం,బీజాపూర్ జిల్లా.

2)బడిసె చందు ఎలియాస్ వాడే చందు, సన్నా/ఫ్. ఐతు ఇలియాస్ మంగయ్య,వయస్సు:27సంవత్సరాలు ఎర్రగుంట పంచాయితీ,ఉప్పాక,ఏడూళ్ల బయ్యారం.

వీరిరువురు మరికొంతమంది మిలిషియా సభ్యులతో కలిసి వారి కమాండర్ ఊకె కైలాష్ ఆదేశాల మేరకు మిలీషియా కమిటీలో పని చేస్తున్నట్లు వెల్లడించారు.

వీరి వద్ద నుండి 08 కేజీల బరువున్న కార్డక్స్ వైరును,35 డిటోనేటర్లను,50 కరపత్రాలను మరియు విప్లవ సాహిత్య పుస్తకాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేసారు.పట్టుబడిన వీరిరువురిపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించడం జరుగుతుందని డిఎస్పీ తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: