CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కె వి పి ఎస్..ఎస్సీ కార్పొరేషన్ రుణాలు డబల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్ ...

Share it:


 చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి : చండ్రుగొండ మండలం 2020 నవంబర్ డిసెంబర్ నెలలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు ప్రభుత్వం ఆన్లైన్ ప్రక్రియన కొనసాగించింది. ఈ ఆన్లైన్ ప్రక్రియ ముగిసి ఏడు నెలల కాలం అవుతుంది. ఇంతవరకూ లబ్ధిదారులను గుర్తించి, వారికి రుణ సదుపాయం కల్పించిన దాఖలాలు లేవు. బహుజన కులాల అయినా నాయి బ్రాహ్మణులకు, విద్యుత్, రజకులకు దోబీఘాట్ , యాదవులకు కురుమలకు గొర్రెలు, గంగపుత్రులకు ముదిరాజులకు చేపలు ఇచ్చారో, దళితులు అభివృద్ధి శాఖ స్వయానా ముఖ్యమంత్రి గారి చేతిలోనే ఉన్నప్పటికీ దళితులకు ఎటువంటి లబ్ధి చేకూరే లేదు, ప్రభుత్వం తక్షణం స్పందించి దళితులకు కార్పొరేషన్ రుణాలు అందించాలి. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఇరుకైన గదుల్లో ఒక ఇంట్లో నాలుగు ఐదు కుటుంబాలు ఆవాసం ఉంటున్నారు నిజమైన లబ్ధిదారులు ప్రభుత్వం గుర్తించి వారికి డబల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని , లేనిపక్షంలో ప్రజా ఆందోళనలు ఉదృతం చేస్తామని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు మిర్యాల మోహన్ రావు, రాయి రాజా, ఎలమంద లక్ష్మణరావు, బడుగు వినోద్, బడుగు గణేష్, వాడపల్లి నవీన్, నందు నూరి క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: