CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అవెన్యూ ప్లాంటేషన్ లో మొక్కలు నాటేందుకు అవసరమైన మొక్కలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను

Share it:

 


ఆదేశించారు.

మన్యం టీవీ కొత్తగూడెం:-

గురువారం కలెక్టరేట్ సమావేశపు హాలు నందు మొక్కలు కొనుగోళ్లు, మల్టీ కలర్ ట్రీ గార్డులు ఏర్పాటు, మల్టీ పర్పస్

మొక్కలు నాటే అంశంపై అటవీ, డిఆర్‌డిఏ, డిపిఓ, వ్యవసాయ, ఉద్యాన, సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి యంపిడిఓ,

ఎంపిఓ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుండి ఉత్తర్వులు రాగానే ప్లాంటేషన్

చేపట్టేందుకు అవసరమైన మొక్కలను సోమవారం వరకు కొనుగోలు చేసి సిద్ధంగా ఉండాలని చెప్పారు. వర్షాలు సకాలంలో

వస్తున్నందున కాలాన్ని సద్వినియోగం చేసుకుని మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. అవెన్యూ ప్లాంటేషన్ లో 10

అడుగులు ఎత్తున్న మొక్కలు మాత్రమే నాటాలని సూచించారు. రహదారులకు ఇరువైపులా ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు, మల్టీ పర్పస్

పూల చెట్లు, క్రోటాన్ మొక్కలు నాటాలని చెప్పారు. పంచాయతీకి అవసరమైన మొక్కలకు సంబంధించి గ్రామ పంచాయతీ తీర్మానం

ద్వారా కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన మొక్కలు యంపిడిఓ, యంపిఓ, మండల ప్రత్యేక అధికారి, డిపిఓ, జడ్పీ సిఈఓలు

ధృవీకరణ చేయాలని చెప్పారు. మొక్కలు కొనుగోళ్లులోని కానీ మొక్కలు నాణ్యతలో కానీ వ్యత్యాసం వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని

ఆర్ధికమపరమైన క్రమశిక్షణ పాటించాలని చెప్పారు.

జిల్లాలో మంచి రహదారులున్నాయని ఏ ఒక్క రహదారిని విడిచి పెట్టకుండా

ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ రహదారులకు ఇరువైపులా అవెన్యూ, మీడియన్ ప్లాంటేషన్లో మల్టీపర్పస్ మొక్కలు నాటాలని

చెప్పారు. మొక్కల సంరక్షణకు ఏర్పాటు చేయనున్న ట్రీ గార్డులు రంగు రంగులు కలిగినవి ఏర్పాటు చేయడం .వల్ల చక్కటి

ఆహ్లాదాన్ని సంతరించుకుంటాయని చెప్పారు. ఇల్లందు క్రాస్ రోడ్డు నుండి పాల్వంచ వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా పిచ్చి

మొక్కలు తొలగించి అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని చెప్పారు. మీడియం ప్లాంటేషన్లో వివిద రకాల మొక్కలు నాటేందుకు ఉద్యాన

అధికారి మరియన్న పర్యవేక్షణ చేయాలని చెప్పారు. మొక్కలు నాటేందుకు ముందస్తుగా గుర్తించిన స్థలాల్లో గుంతలు తీసి సిద్ధంగా

ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి రంజిత్, డిఆర్డిఓ మధుసూదనరాజు, డిపిఓ రమాకాంత్, వ్యవసాయ అధికారి

అభిమన్యుడు, ఉద్యాన అధికారి మరియన్న, జడ్పీ డిప్యూటీ సిఈఓ నాగలక్ష్మి, సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి యంపిడిఓలు,

యంపిఓలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: