మన్యం టివి మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని తిర్లాపురం లో రూ.22 లక్షల రూపాయల తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికలను బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను సంఘటితం చేసేందుకే రైతు వేదికల నిర్మాణం చేపట్టామని అన్నారు. వ్యవసాయాన్ని నమ్ముకొని జీవించే రైతులు వారు కాలాన్ని బట్టి పంటలు వేసుకొని అధిక లాభాలు గడించడానికి సరైన సలహాలు సూచనలు మెలుకువలు తెలియజేయడానికి ఇటువంటి రైతు వేదికలు ఎంతో ఉపయోగపడతాయి అని అన్నారు.రైతు దేశానికి వెన్నెముక అని రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను అత్యున్నత స్థానానికి తీసుకుని పోవడానికి,పాటుపడుతున్నారని,బంగారు తెలంగాణ నిర్మాణం లో భాగంగా రైతు ను రాజు చేయడమే ద్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు,రైతు భీమా,రైతు వేదిక లాంటి గొప్ప కార్యక్రమాలు, ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు అని తెలియజేసారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన తర్వాత రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ర్టం తెలంగాణ రాష్ట్రం టిఆర్ఎస్ ప్రభుత్వం అని గుర్తు చేశారు.రైతుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు.రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని వారిని సర్పంచు లు,వ్యవసాయ శాఖ సిబ్బంది సూచనలు, సలహాలు ఇచ్చి రైతులను ముందుకు తీసుకుని వెళ్ళాలి అన్నారు.పంటలకు సంబంధించిన ఎరువులు, మందులు ఎలా వాడాలో, భూ సారం సంబంధించిన సమాచారం ఇక్కడ అందుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం నర్సింహారావు, తహసీల్దార్ చంద్ర శేఖర్, ఎంపీడీఓ వీరబాబు,స్పెషల్ ఆఫీసర్ రమాదేవి పిఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, అగ్రికల్చర్ ఏవో తాతారావు, ఆత్మ కమిటీ చైర్మన్, పోనుగోటి భద్రయ్య,రైతు బంధు సమితి అధ్యక్షులు, దొబ్బల వెంకటప్పయ్య, ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షులు గుడిపూడి కోటేశ్వరరావు,ఎంపీటీసీలు, కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా,సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు ఏనిక ప్రసాద్, సర్పంచ్ లు,కాయం. తిరుపతమ్మ,బచ్చల భారతి, కొమరం జంపేశ్వరి,బొగ్గం రజిత,కురసం.రాంబాబు,భూర్గంపాడ్ మార్కెట్ కమిటీ,డైరెక్టర్ సకిని. బాబురావు,సొసైటీ డైరెక్టర్ మామిడిపల్లి.సీతారాములు, ఉప సర్పంచ్ ప్రభుదాస్, పుచ్చకాయల శంకర్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్, టిఆర్ఎస్ నాయకులు,వట్టం రాంబాబు,నియోజకవర్గ మీడియా ఇంచార్జి తాళ్లపల్లి యాదగిరి గౌడ్,ఎడ్ల శ్రీను,ముద్దంగుల కృష్ణ, తంత్రపల్లి కృష్ణ,నైనారపు. నాగేశ్వరరావు,మండల యువజన అధ్యక్షులు హర్షవర్ధన్,రాజేష్,జక్కం రంజిత్,పద్ధం.శ్రీనివాస్, సోషల్ మీడియా ఇంచార్జి సిరికొండ శ్యామ్ సుందర్, రామకోటి,బొశెట్టి రవి ప్రసాద్,గుర్రం సృజన్, సురేందర్ పటేల్,రైతులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: