CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

Share it:

 


👉భూర్గంపాడ్ ఎస్ ఐ జితేందర్

మన్యం టీవీ, భూర్గంపాడ్:నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు,అలాంటి వారిపై పీడీ కేసు నమోదు చేస్తామని భూర్గంపాడ్ ఎస్ ఐ జితేందర్ హెచ్చరించారు.ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నకిలీ విత్తనాలు అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు చేశారు.భూర్గంపాడ్ ఎస్ ఐ జితేందర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

తేదీ 3-06-2021 ఉదయం నకిరిపేట మరియు అంజనాపురం రైతుల వద్ద లోటస్ సీడ్స్15 , కర్షక్ సీడ్స్ 20 పాకెట్స్ , మలబార్ సీడ్స్ 20 పాకెట్స్ యూనిసేమ్ సీడ్స్ 20 ప్యాకెట్స్ మొత్తం 75 పాకెట్స్ మిర్చి విత్తనాలు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పాటి మీద తండా కు చెందిన బానోత్ వీరన్న S/o బాహ్య అనే వ్యక్తి ఎటువంటి లైసెన్స్ మరియు అనుమతి పత్రాలు లేకుండా అనధికారికంగా అమ్మినాడు.అదేవిధంగా తేదీ 9-6-2021 ఉదయం 7 గంటలకు అంజనాపురం బస్ స్టాండ్ వద్ద బానోత్ వీరన్న వద్ద లోటస్ సీడ్స్ 98 పాకెట్స్ మరియు రూపు రెడ్డి సుదర్శన్ రెడ్డి గూడూరు నివాసి వద్ద

87 మలబార్ సీడ్స్ మిర్చి విత్తన పాకెట్స్ పట్టుకొనడం జరిగింది. మొత్తం 260 మిర్చి విత్తన పాకెట్స్ వీటి విలువ 1,76,140/- మరియు విత్తన నాణ్యత పరీక్షల నిమిత్తం STL Hyderabad కు పంపడం జరిగింది. వీటిని వీరి వద్ద భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిర్చి విత్తనాలు అమ్మడానికి  

ఎటువంటి అనుమతులు లేవు. అందువల్ల వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది.

 కావున గ్రామాల్లో ఎవరైనా నకిలీ విత్తనాలు లేదా కల్తీ విత్తనాలు మరియు అనుమతులు లేకుండా , దొంగతనంగా అమ్మినచో వారిపై PD ACT ద్వారా కేసులు పెట్టి జైలుకు 

పంపడంతో పాటు కఠినంగా శిక్ష విధించిను. విత్తన డీలర్లు ఇటువంటి విత్తనాలు అమ్మినచో విత్తన లైసెన్స్ రద్దు పరచి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడునని ఎస్ ఐ.S జితేందర్ హెచ్చరించారు.

Share it:

TELANGANA

Post A Comment: