CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఐసోలేషన్ సెంటర్లను కోవిడ్ బాధితులు సద్వినియోగం చేసుకోండి.

Share it:

 


•మండల స్పెషల్ ఆఫీసర్ గడ్డం ముత్యం.


చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి


మహమ్మారి కరోనా వైరస్ బారిన పడి గ్రామీణ ప్రాంతం ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గ్రహించి. ప్రతి మండలం లో ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో. మండల కేంద్రంలోని గిరిజన బాలికల వసతి గృహాన్ని ఐసోలేషన్ సెంటర్ గా మార్చారు. మండలంలో ఉన్న కరోనా బాధితులు ఇళ్లలో ఉంటానికి ఇబ్బందికరంగా ఉంటే. వెంటనే మండల కేంద్రంలోని ఐసోలేషన్ సెంటర్లను వినియోగించుకోవాలని మండల స్పెషల్ ఆఫీసర్ గడ్డం ముత్యం సూచించారు. శుక్రవారం చండ్రుగొండ మండల కేంద్రములో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్ ను ఆయన పరిశీలించారు. అనంతరం మండల పరిధిలోని తిప్పనపల్లి వంకనెంబర్ తుంగారం గ్రామ పంచాయతీల్లో కరోనా బారిన పడిన బాధితులు ఇళ్లకు వెళ్లి సలహాలు సూచనలు ఇచ్చి ధైర్యం చెప్పారు. గ్రామాల్లో జరుగుతున్న వివాహ వేడుకలు వద్దకు వెళ్లి కోవిడ్ నిబంధనల ప్రకారమే శుభకార్యాలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ అనుమతులను మించి ఎక్కువ జనాభా ఉంటే వారిపై కోవిడ్ 19 నిబంధన ఉల్లంఘన కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న గ్రామాల్లోనే ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేసి వారికి కావాల్సిన అన్ని విధాల సౌకర్యాలను కల్పించాలని ఆదేశాలు ఇవ్వడంతో చండ్రుగొండ తిప్పనపల్లి తుంగారం వంక నెంబర్ గ్రామాల్లో ఐసోలేషన్ సెంటర్లను పరిశీలిస్తున్నామని చండ్రుగొండ లో గిరిజన బాలికల వసతి గృహాన్ని ఐసోలేషన్ సెంటర్ వినియోగం తీసుకువచ్చామని అలాగే తిప్పనపల్లి లో మండల ప్రాథమిక ఉన్నత పాఠశాలను తుంగారం పరిసర ప్రాంతాల ప్రజలకు రేపల్లె వాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను వంక నెంబర్ పరిసర ప్రాంతాల ప్రజలకు పోకలగూడెం జిల్లా ఉన్నత పరిస్థితి పాఠశాలను ఐసోలేషన్ సెంటర్లు గా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఇక్కడి వసతులను పరిశీలించి కలెక్టర్ కు పుర్తి నివేదిక అందజేస్తామని త్వరలోనే వాటిని ఐసోలేషన్ సెంటర్ గా మారుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ ఎం ఉష శారద, మండల వైద్యాధికారి నీ డాక్టర్ ఎస్ గీత, హెల్త్ సూపర్వైజర్ ఇమామ్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: