👉గ్యాస్ ఏజెన్సీ పరిధి 30 కిలోమీటర్లు దాటితే10/ అధికముగా ఇవ్వవలెను.
మన్యం టీవీ కొత్తగూడెం:-
జిల్లా లోని వివిధ గ్యాస్ ఏజన్సీల వారు వారి యొక్క గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి
సంబంధించిన గ్యాస్ బుకింగ్ చేసుకునే నెంబర్ ద్వారా కస్టమర్ లు గ్యాస్ సిలిండర్ బుక్
చేసుకున్న తరువాత అట్టి వారికి సంబంధిత గ్యాస్ ఏజన్సీ వారు నిర్ణీత గడువులోపల డెలివరీ
చేయుదురు. ప్రస్తుతము 14.2 కేజీల గృహ అవసర గ్యాస్ సిలిండర్ ధర రూ.848.50.
గ్యాస్ ఏజన్సీ పరిధిలోని వినియోగ దారులకు పై తెలిపిన రూ.848.50 మాత్రమే
చెల్లించాలి. గ్యాస్ ఏజన్సీ పరిధి దాటి 30 కిలోమీటర్ల దూరములో ఎల్.పి.జి. వినియోగ
దారులు ఉంటే 10/- అదికముగా ఇవ్వవలెను. ఒక వేళ ఎల్.పి.జి వినియోగ దారులు గ్యాస్
ఏజన్సీ పరిధి నుండి 30 కిలోమీటర్ల పై బడి ఉన్నచో గ్యాస్ సిలిండర్ ధర కంటే అధికముగా
చెల్లించవలెను.
జిల్లా లో కొంత మంది గ్యాస్ ఏజన్సీల వారు కస్టమర్లకు గ్యాస్ సిలిండర్లు
పంపించునపుడు డెలివరీ బాయ్ పైన తెలిపిన రుసుము కంటే కూడా అధికముగా 50/-
రూపాయలు వసూలు చేయుచున్నట్లు
కార్యాలయమునకు పిర్యాదులు అందుతున్నవి.
కావున ఎల్.పి.జి వినియోగదారులకు తెలియ పరుచునది ఏమనగా డెలివరీ బాయ్స్ కు
రసీదులో చూపబడిన విధముగా మాత్రమే డబ్బులు చెల్లించగలరు.
అదే విధముగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో గ్యాస్ బుకింగ్ కోసము వినియోగ దారులు
ఈ క్రింద తెలిపిన ఫోన్ నంబర్లకు డీలర్ల వారీగా ఫోన్ చేసి సిలిండర్లు ఆన్లైన్ ద్వారా బుక్
చేసుకొనగలరు.
HI.P.C.L ఆన్లైన్ బుకింగ్ నెంబర్ : 9666023456
1.0.C.L ఆన్లైన్ బుకింగ్ నెంబర్ : 1718955555
B.P.C... ఆన్లైన్ బుకింగ్ నెంబర్: 7715012345.
Post A Comment: