మన్యం మనుగడ, కరకగూడెం:
తెలంగాణ ప్రభుత్వం ఆటవి శాఖ కల్లాo నెంబర్ 17
యూనిట్ నెంబర్ 19 రేంజి ఏడూళ్ల బయ్యారం 06మే నుండి 15 మే వరకు తునికి ఆకు సేకరించారు .ప్రజలు ఈ కరోనా మహమ్మారి పరిస్థితి లో కూడా లెక్క చేయకుండా ఎండలో వెళ్లి ముళ్లలో రాళ్లలో వెళ్లి అడవి జంతువుల కు భయపడుతూ... అడివీ కి వెళ్లి తునికి ఆకు సేకరించార తునికిఆకు సేకరించి చాలా రోజులు అవుతున్న ఇంకా డబ్బులు రాలేదు. కల్లా దారు నీ ప్రజలు వెళ్లి అడగగా పైనుంచి సార్లు డబ్బులు ఇవ్వంది మేము ఏల ఇవ్వాలి అని అంటున్నారని తునికాకు కూలీలు ఆవేదన వెలిబుచ్చారు. తునికిఆకు సేకరించి చాలా రోజులు అవుతుంది ఇంకా డబ్బులు రాలేదు మా డబ్బులు మాకు వస్తాయో రావో అని ఆందోళనకి గురిఅవుతున్నారు.
దీనికి సంబంధించిన అధికారులు స్పందించి ప్రజలకి డబ్బులు ఇపించగలరని వారు కోరుతున్నారు.
Post A Comment: