మన్యంటీవీ, అశ్వారావుపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం పాత నారంవారిగూడెం గ్రామ పంచాయతీకి చెందిన పోలి రాజు (32)13 రోజుల క్రితం ఆర్ధికపరిస్థితులు వల్ల ఇబ్బంది పడుతూ పురుగులు మందు త్రాగి మృత్యువాత పడ్డాడు. మృతుడికి భార్య నాగేశ్వరి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య నాగేశ్వరి చిట్టితల్లి సేవ సమితి వారిని సహాయం కోరగా, వెంటనే సేవసమితి సభ్యులు మీకు తప్పకుండ సహాయం చేస్తామని భరోసా ఇచ్చి, విషయాన్ని వెంటనే చిట్టితల్లి సేవ సమితి ఆంబులెన్స్ వ్యవస్థాపకులు మరియు పాతనారావారిగూడెం సర్పంచ్ మనుగొండ వెంకట ముత్యం కి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సర్పంచ్ వెంకటముత్యం చిట్టితల్లి సేవసమితి తరుపున ఆ కుటుంబానికి 50 వేల రూపాయిలు ఆర్ధిక సహాయం చేసి, ఇంకా ఎలాంటి ఇబ్బంది లేకుండా చిట్టితల్లి సేవ సమితి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆళ్ల సత్యనారాయణ, సత్తెనపల్లి వెంకటేశ్వరరావు, చిమడబోయిన సురేష్, పాకనాటి రవికిషోర్, పేరుబోయిన రవి, పాకనాటి వెంకటేశ్వరావు, రవిశేఖర్,వేముల శ్రీను, ఆళ్ల లాలయ్య, ఆళ్ల రామకృష్ణ, సుండ్రు దుర్గారావు, కంపసాటి మహేష్, నారం పోతురాజు, వనమా గోపి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: