మన్యం టీవీ మణుగూరు:
థి ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవతా విలువల సంస్థ *ఐ ఏ హెచ్ వి* ద్వారా మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి 4 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సంస్థ ప్రతినిధులు ద్వారా అందించడం జరిగినది. ఆధ్యాత్మిక గురువు,ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులైన శ్రీ శ్రీ రవి శంకర్ 1997లో స్థాపించిన *అంతర్జాతీయ మానవతా విలువల సంస్థ* ప్రభుత్వ ఆసుపత్రుల లో సాంకేతిక పరికరాలు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తోంది. కరోనా రెండవ దశలో రోగులకు ఉపయోగపడే విధంగా మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి *లాంగ్ ఫియన్ సంస్థ* ద్వారా 4 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఆసుపత్రి ఇంచార్జ్ మెడికల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు కు అందించడం జరిగింది.ఈ సందర్బంగా *ఆర్ట్ అఫ్ లివింగ్ గ్రామీణ వింగ్* వైఎల్టిపి తెలంగాణ ఎస్సీఎం బండి చైతన్య కిషోర్ తెలిపారు.సంస్థ వాలంటీర్స్ నాగ సీతారాములు,ఎస్కె. రహీం,సాయి,తేజ,ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా హాస్పిటల్ ఇంచార్జి వెంకటేశ్వర్లు, మాట్లాడుతూ ఇంతటి కష్టకాలంలో సంస్థ వారు ఏంతో విలువైన ఆక్సీజన్ కాన్సంట్రేటర్లను మన మణుగూరు హాస్పిటల్ కి ఇవ్వడం చాలా సంతోషకరం అని,ఈ మిషన్లు కరోనా రోగులకు ఎంతో ఉపయోగకరం అని సంస్థకు, సంస్థ గురువులకు, ప్రతినిధులకు అభినందనలు తెలియజేసారు.
Post A Comment: