CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జూన్ 30వ తేదీ వరకు ప్రధాన రహదారులపై అవెన్యూ ప్లాంటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీ ప్రోడ్ స్ట్రెచ్ ప్రత్యేక అధికారులను ఆదేశించారు

Share it:

 


మన్యం టీవీ కొత్తగూడెం,జూన్ 28:-

సోమవారం ప్రధాన రహదారుల వెంబడి అవెన్యూ ప్లాంటేషన్ కొరకు నియమించిన

రోడ్ (హెచ్ ప్రత్యేక అధికారులతో అవెన్యూ ప్లాంటేషన్లో మొక్కలు సేకరణ, మొక్కలు నాటుట, మొక్కలు నాటేందుకు గుంతలు

తీయు ప్రక్రియపై టెలి కాన్ఫరెన్సు ద్వారా పరోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 1వ తేదీ నుండి

10వ తేదీ వరకు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం కానున్నందున మండల ప్రత్యేక అధికారులు పాల్గొనాల్సి ఉన్నదని,

ప్రాధాన్యతను అర్ధం చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 30వ తేదీ వరకు పూర్తి చేసి సమగ్ర నివేదికలు అందచేయాలని చెప్పారు.

జిల్లాలో మొత్తం 448 కిమీ మేర అవెన్యూ ప్లాంటేషన్ ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నదని ప్రతి రోడ్డుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించామని

అధికారులు నిర్దేశించిన విధంగా మొక్కలు నాటే ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రధాన రహదారుల్లో ఏ

రోడ్డు, ఏ స్ట్రెచ్ వదలడానికి వీల్లేదని అన్ని రహదారులకు ఇరువైపులా మల్టీ పర్పస్ మొక్కలు నాటాలని చెప్పారు. మోరంపల్లి బంజర

జంక్షన్లో ఏర్పాటు చేయనున్న కూడలిని అందమైన మొక్కలు నాటేందుకు కార్యాచరణ తయారు చేసి తనకు పంపాలని ఆర్డీఓను

ఆదేశించారు. మొక్కలు నాటేందుకు గుంతలు తీయు ప్రక్రియ చాలా ప్రధానమని అగర్ యంత్రాలను వినియోగించి గుంతలు తీసి

సిద్ధంగా ఉంచాలని చెప్పారు. రహదారుల ప్రక్కన ఉన్న పిచ్చి మొక్కలు క్లియరెన్సు చేయించి మొక్కలు నాటాలని, అవకాశం ఉన్న

మేర మొక్కలు నాటాలని మద్య మద్యలో అందమైన మల్టీపుల్ మొక్కలు నాటాలని చెప్పారు. అవెన్యూ ప్లాంటేషన్ ప్రక్రియలో నాటిన

మొక్కలు పరిశీలన కొరకు ప్రభుత్వం ఫ్లయింగ్ స్కాడ్స్ ద్వారా తనిఖీ నిర్వహించే అవకాశం ఉన్నదని చెప్పారు. అవెన్యూల ప్లాంటేషన్

ప్రక్రియ చాలా చోట్ల ప్రగతి మంచిగా ఉన్నదని, మిగిలిన చోట్ల కూడా పూర్తి చేయాలని చెప్పారు. మాన్యూరు, ఎరువులు వేయాలని

మొక్క ఆరోగ్య వంతంగా పెరింగేందుకు బాగా ఉపయోగపడుతుందని, మొక్కలు గాలికి, వర్షానికి పడిపోకుండా సపోర్టుగా కర్రలను

ఏర్పాటు చేయడంతో పాటు ట్రీ గార్డులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. రహదారి పొడవునా మొక్కలు ఉండాలని గ్యాప్స్

ఎక్కడా ఉండటానికి వీల్లేదని, మొక్కకు మొక్కకు మద్యన ఎక్కడా ఎడం ఉండటానికి వీల్లేదని, ఎడం ఉన్నట్లయితే తక్షణమే మొక్కలు

నాటాలని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక పర్యవేక్షణ ద్వారా మొక్కలు నాటు ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు.

ఈ టెలి కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్డిఓ మధుసూదన రాజు, జడ్పీ సిఈఓ విద్యాలత, డిపిఓ

రమాకాంత్, ఆర్డీఓ స్వర్ణలత, పిఆర్ ఈఈ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: