CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉25 తేదీ శుక్రవారం ప్రతి ఒక్కరు డ్రై డే నిర్వహించి పరిసరాలను పరిశుభ్రం చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రజలకు సూచించారు.

Share it:

 


మన్యం టీవీ కొత్తగూడెం:-

ఇంటిలో మురుగు నీటి నిల్వలు, కూలర్లు లోని నీరు, కుండీలలో నిల్వ ఉన్న నీరును తొలగించాలని, నీటి నిల్వలు వల్ల దోమలు వ్యాప్తి జరిగి అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయని అందువల్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని చెప్పారు.

పల్లె,పట్టణప్రగతిలో భాగంగా గ్రామాలు,పట్టణాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణ కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని పంచాయతి, మున్సిపల్ అధికారులకు సూచించారు.మురుగు కాలువల్లో నీటి నిల్వలు వల్ల దోమలు వ్యాప్తి జరిగే అవకాశం ఉందని 

నీటి నిల్వలు లేకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. మురుగు నీరు నిల్వ ఉండే పల్లపు ప్రాంతాల్లో నీటి నిల్వలు ఉండకుండా నాణ్యమైన

గ్రావెల్ తో నింపాలని, మురిగు నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో లార్వా వృద్ది చెందకుండా ఆయిల్ బాల్స్ వేయాలని చెప్పారు.ఇలా చేయడం వల్ల ప్రజలు మలేరియా, డెంగీ, చికెన్ గున్యా వంటి ప్రాణాంతక వ్యాధులనుండి ప్రజలను రక్షించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా సీజనల్ వ్యాధులు సంక్రమించకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర సేవలు నిర్వహణకు అవసరమైన తగినన్ని మందులు సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. ఆరోగ్య కేంద్రాల్లో సేవలను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఎప్పటి కప్పుడు తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. మెడికల్ అధికారులు ఆరోగ్య కేంద్రాల పరిధిలో గల గ్రామాలను సందర్శిస్తూ సీజనల్ వ్యాధులు, పారిశుధ్యంపై ప్రజలను చైతన్య పరుస్తూ వ్యాధులు ప్రబలుతున్న గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని చెప్పారు. వ్యాధి సోకిన వ్యక్తుల రక్త నమూనాల పరీక్షలు నిర్వహించాలని, నిర్దారణ అయిన వ్యక్తులకు మందులు అందజేయడంతో పాటు పర్యవేక్షణ చేయాలని చెప్పారు.ప్రతి పి హెచ్ సి లో కోవిడ్ టెస్టులు చేసి పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు హోం కిట్లు పంపిణీ, పటిష్ఠ హోం ఐసోలేషన్ ఉండు విదంగా పర్య వేక్షణ చేయాలని చెప్పారు.వ్యాధుల సంక్రమించకుండా గ్రామ, మున్సిపల్ స్థాయిలో చైర్మన్లు సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డ్ మెంబర్లు, మహిళా సంఘాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు.పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా మిషన్ భగీరథ పైప్ లైన్స్ లీకేజీలను గుర్తించి మరమ్మత్తులు నిర్వహించాలని చెప్పారు.ఏడో విడత హరితహారం ప్రగతిపై ప్రతి రోజు నివేదికలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. పాటశాలల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని పంచాయతి, మున్సిపల్ అధికారులకు సూచించారు. సీజన్లో వ్యాధులు బారిన పడకుండా ప్రజలు వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలని చెప్పారు. 

గిరిజన ప్రాంతం కాబట్టి శారీరక, పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించి మలేరియా, డెంగ్యూ జ్వరాలు సోకకుండా ప్రజలను రక్షించేందుకు మూడు నెలల చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.మెడికల్ క్యాంపులు నిర్వహణకు షెడ్యూల్ తయారుచేయాలని చెప్పారు. జిల్లాను ప్రగతిపథంలో ఉంచేందుకు శానిటేషన్ నిర్వహణ, మంచి నీటి వనరులు ప్రతి 10 రోజులకు 

బ్లీచింగ్, క్లోరినేషన్ చేయాలని చెప్పారు. హరితహారంలో మొక్కలు నాటడం, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి పనులు.ముమ్మరంగా చేపట్టడం సమస్యలు పరిష్కరించడం, సీజనల్ వ్యాధుల నుండి ప్రజలను రక్షించడంలో అధికారులు అంకిత భావంతో పనిచేసి జిల్లాను ప్రగతి పథంలో నిలపాలని ఆయన సూచించారు.

Share it:

POLITICS

Post A Comment: