మన్యం టీవీ కొత్తగూడెం:-
అవెన్యూ ప్లాంటేషన్ లో మొక్కలు నాటేందుకు గుంతలు తీయు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చెప్పారు. గుంతలు తీయు ప్రక్రియ నత్త నడకన సాగుతున్నట్లు గమనించడం జరిగిందని వేగవంతం చేయాలని చెప్పారు. గుంతలు తీయు ప్రక్రియతో పాటు ప్రత్యామ్నాయంగా మొక్కలు నాటు కార్యక్రమం జరగాలని చెప్పారు. మొక్కలు నాటేందుకు గుంతలు తీయి ప్రక్రియ అత్యంత ప్రధానమైనదని, ప్రాధాన్యతను గమనించి త్వరిత గతిన గుంతలు తీయుటతో పాటు మొక్కలు నాటాలని ఆయన స్పష్టం చేశారు. గుంతలు ప్రక్రియను సత్వరమే పూర్తి చేయుటకు అగర్ యంత్రాలను వినియోగించాలని చెప్పారు. అవకాశం ఉన్న చోట ఉపాధి హామీ పథకం కూలీలతో గుంతలు తీపించాలని చెప్పారు. గుంతలు తీసే ప్రక్రియలో ఆశించిన మేర పురోగతి కనిపించాలని చెప్పారు. గుంతలు తీయు విషయంలో ఎంపిఓ, ఎంపిడిఓ, మండల ప్రత్యేక అధికారులు, అవెన్యూ ప్లాంటేషన్ ప్రత్యేక అధికారులు పటిష్ఠ పర్యవేక్షణ చేయాలని తెలిపారు. జిల్లాలోని అన్ని రహదారులకు రోడ్లకు ఇరువైపులా 10 అడుగులు ఎత్తున్న మొక్కలతో పాటు మల్టీ పర్పర్స్ అందమైన పూల మొక్కలు నాటాలని చెప్పారు. నాటేందుకు మొక్కలు సేకరణ మరియు మొక్కలు నాటే ప్రక్రియ ఈ నెల 25 వరకు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి కావాలని ఆదేశించారు. మొక్కలు నాటేందుకు తీసే గుంత యొక్క పరిమాణం ఎటువైపు చూసినా 2 లోతు, వెడల్పు కలిగి ఉండాలని చెప్పారు. మొక్కలు ఏపుగా, ఆరోగ్యముగా పెరిగేందుకు ప్రతి గుంతలో సమృద్ధిగా ఎరువులు వేయాలని సూచించారు. అవెన్యూ ప్లాంటేషన్ లో ఎంపిఓలు, ఎంపిడిఓలు, మండల స్పెషల్ ఆఫీసర్లు, అవెన్యూ కొరకు నియమించిన ప్రత్యేక అధికారులు అవెన్యూ ప్లాంటేషన్ లో మొక్కలు నాటు ప్రక్రియలో పూర్తి స్థాయిలో నిమగ్నమవ్వాలని నిర్దేశిత సమయం లోగా లక్ష్యం మేర అవెన్యూ ప్లాంటేషన్ లో మొక్కలు నాటు ప్రక్రియలో జాప్యం జరగకుండా సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
Post A Comment: