CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే దీక్షను విజయవంతం చేయండి

Share it:


*నియోజకవర్గంలోని పోడు రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలి.

*తాలపునే గోదారి ఉన్న ములుగు ప్రాంతానికి ఒక చుక్క నీరు ఇవ్వడం లేదు.

*కార్యకర్తలు సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మహిళా జాతీయ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు  నల్లెల కుమారస్వామి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేయాలని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని ప్రతి ఒక్క కార్యకర్త ను కంటికి రెప్పలా కాపాడుకుంటామని సీతక్క అన్నారు. తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి  అసెంబ్లీ సాక్షిగా పోడు భూములకు పట్టాలు ఇస్తా కుర్చీసి కూర్చొని పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తాం అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కనీసం స్పందించకపోవడం దారుణమని అన్నారు. ఒకపక్క ఫారెస్ట్ అధికారులు రైతుల పై దాడులు చేస్తున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధాకరమని సీతక్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోడు రైతుల పక్షాన ఈనెల 25న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్ష కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పోడు రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని సీతక్క పిలుపునిచ్చారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి ఏడు తీర్మానాలను ప్రవేశపెట్టగా తీర్మానాలను ఆమోదించిన కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క1,వెనుకబడిన ములుగు నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించాలి.2, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి, ఫారెస్ట్ అధికారుల దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.3, గిరిజన యూనివర్సిటీ తరగతులు ప్రారంభించాలి,నర్సింగ్ కళాశాల మంజూరు చేయాలి.4,రైతులకు సబ్సిడీ కింద విత్తనాలు ట్రాక్టర్లు ఇవ్వాలి. 5,ఏటూరు నాగారం మండలాన్ని రెవెన్యూ డివిజన్ ప్రకటించాలి.6,మల్లంపల్లి ని మండలంగా ప్రకటించాలి.7, ములుగు జిల్లా కేంద్రంలో పరిశ్రమలను ఏర్పాటు చేయాలి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, కిసాన్ సెల్, మైనార్టీ సెల్, ఎస్టీ సెల్, ఎస్సీ సెల్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, 9 మండలలా అధ్యక్షులు, మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్లు, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: