CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వరి ధాన్యం క్వింటాకు 2500 రూపాయలు మధ్ధతు ధర ఇవ్వాలి

Share it:

 


*సీతక్క యువసేన మండల అధ్యక్షులు చేర్ప రవీందర్.

మన్యం టీవీ ఏటూరు నాగారం

వరి ధాన్యం క్వింటా కు 2500 రూపాయలు చెల్లించాలి అని సీతక్క యువసేన మండల అధ్యక్షులు చేర్ప రవీందర్ డిమాండ్ చేసారు..శనివారం సమ్మక్క సారక్క తాడ్వాయి మండలం ఊరట్టం గ్రామపంచాయతీ జంపగవాయి లో వరి ధాన్యం రైతులతో కలిసి మాట్లాడారు. రైతుల పక్షపాతీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న చతిస్గడ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ప్రకటించిన మద్దత్తు ధర 1870 రూపాయల కు అదనంగా 630 రూపాయలు  బోనస్ ఇచ్చి క్వింటాకు  రైతులకు 2500 రూపాయలు ఇస్తుంటే తెలంగాణ లో రైతు వ్యతిరేకంగా తెరాస ప్రభుత్వం పని చేస్తు కేవలం సుమారుగా 1870 మాత్రమే ఇస్తుంది అని, దింతో ప్రతి రైతు ప్రతి ఒక ఎకరం కు సుమారుగా 23000 రూపాయలు నష్టపోతున్నారు. అని, కొంత మంది తెరాస నాయకులు మాత్రం దళారీ పాత్ర పోసిస్తూ తెలంగాణా లో వరి ధాన్యం కొని కాంగ్రెస్ పాలిత ఛత్తిష్ గడ్ రాష్ట్రము కు లారీ లో తీసుకెళ్లి వేల    కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.అని అనుమానం వ్యక్తం చేశారు.ఇప్పటికైనా తెలంగాణా రాష్ట్రము లో కూడా ధాన్యం కు మద్దతు ధర క్వింటాకు 2500 చెల్లించాలి అని లేకపోతే  ప్రభుత్వం కు  రైతుల ఉసురు తగులుతుంది అని అన్నారు.ధనిక రాష్ట్రము అని పదేపదే చెప్పే ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర ఎందుకు చెల్లించడం లేదో చెప్పాలి అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో సీతక్క యువసేన జిల్లా నాయకులు మడప జోగయ్య, చేర్ప వీరమోహన్ రావు, బొబ్బిలి పాపయ్య, గజ్జెల రాజశేఖర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: