ఆదివాసీ పెద్దలు, నాయకులు, యువకులు హాజరుకావాలి
పినపాక మండల ఆదివాసి ఐక్యవేదిక
మన్యం మనుగడ, పినపాక: పినపాక మండలం లోని జానంపేట ప్రధాన రహదారి ప్రక్కన నిర్మించే ఆదివాసుల ఆరాధ్యదైవం కొమరం భీమ్ విగ్రహ ఏర్పాటు కు సంబంధించి భూమి పూజ కార్యక్రమాన్ని జూన్ 21న చేస్తున్నామని, ఆదివాసి ఐక్య వేదిక అధ్యక్షుడు తోలెం శ్రీనివాస్ అన్నారు. శనివారం నాడు అమరారం గ్రామంలో ఆదివాసుల సమావేశం ఏర్పరచుకొని జూన్ 21 న విగ్రహ ఏర్పాటుకు సంబంధించి భూమి పూజ కార్యక్రమాన్ని చేద్దామని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఐక్య వేదిక సభ్యులు మాట్లాడుతూ మండలానికి సంబంధించిన ఆదివాసీ పెద్దలు, నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోఆదివాసి ఐక్యవేదిక ఉపాధ్యక్షుడు గొగ్గల కృష్ణ, అమరారం ఎంపీటీసీ కాయం శేఖర్,సర్పంచు బాడిస మహేష్ , రామయ్య, ఆదివాసీ సలహాదారులు కొమరం నాగేంద్రబాబు, అరుణ్ కుమార్, పాల్వంచ నాగేశ్వరరావు , జంపన్న, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: