CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, ధరలను తగ్గించాలి.. ప్రభుత్వ భూములను అమ్మేందుకు తెచ్చిన జీవో 13 ను రద్దు చేయాలి..

Share it:

 



  మన్యం టీవీ : జూలూరుపాడు, సిపిఎం కార్యాలయంలో కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన తెలియజేసిన సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల కార్యదర్శులు గుండె పిన్ని వెంకటేశ్వర్లు, చీమల పాట్టి బిక్షం, ఎదులాపురం గోపాలరావు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంపు వామపక్ష పార్టీల పిలుపుమేరకు శనివారం జూలూరుపాడు సిపిఎం కార్యాలయంలో సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీ పెట్టుబడిదారీ వర్గాలకు కొమ్ము కాస్తూ పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల, ధరలు పెంచి పేద మధ్య తరగతి వర్గాల ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు 6 వారాల వ్యవధిలో 24 సార్లు పెంచారని కరోనా కష్టకాలంలో ఉపాధి లేక విలవిలలాడుతున్న సామాన్య ప్రజలపై ధరలు పెంచటం నెత్తి మీద పిడుగు పడ్డట్టు ఉందని ఇకనైనా నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని కోరారు. కరోనా కష్టకాలంలో ఉపాధి కోల్పోయిన కార్మికులకు 7500 రూపాయలు, 15 కేజీల బియ్యం, ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు ఎస్కే నాగుల్ మీరా, దేవినేని జనార్ధన్, గార్లపాటి వెంకటి, గార్లపాటీ పవన్, నరసింహారావు, రాము, కుక్కల బిక్షం, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: