CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అశ్వారావుపేట మండలం లో పకడ్బందీగా లాక్ డౌన్ నిర్వహణ

Share it:

 



 మన్యంటీవీ,అశ్వారావుపేట:

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లాక్ డౌన్ పై సమీక్ష చేసిన అనంతరం కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఆంక్షలు కఠిన తరం చేస్తూ ఉద‌యం 10 గంట‌ల 10 నిమిషాల‌ తర్వాత రోడ్లపై ఎవరు కనిపించినా విపత్తు నిర్వహణ నియమాలు కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. ఆ ప్రకారమే నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో గల మూడు రోడ్ల కూడలిలో సిఐ బంధం ఉపేందర్ రావు భారీ వాహనాలు రాకపోకలతో సహా ద్విచక్ర వాహనదారులను నిలువరిస్తున్నారు. ప్రతి వాహ‌నాన్ని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు వ్యవసాయ సంబంధ, అత్యవసర, అనారోగ్య బాధితులకు మినహాయింపు ఇస్తు గాలికి తిరిగే వారిని మాత్రం వదలడం లేదు. అనవసరంగా వీధుల్లోకి వచ్చే వారి వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు.

ఈ సందర్భంగా సిఐ బంధం ఉపేందర్ రావు మాట్లాడుతూ నిబంధనలు విధించుకున్నది అందరి క్షేమం కోసం మాత్రమేనని, ఇలాంటి సమయంలో సైతం అనవసరంగా, అసందర్భంగా ప్రవర్తించడం క్షమించరాని నేరమని హెచ్చరించారు. అందరూ అందరికి సహాకరిస్తేనే సమాజం సుఖశాంతులతో ఉంటుందని హితవు పలికారు.ఆయన వెంట ఎఎస్ఐ సత్యనారాయణ, ఇతర పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: