CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

కరోనాతో మహిళ మృతి -పియస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా మృతదేహానికి అంత్యక్రియలు..!

Share it:

 




 మన్యంటీవీ,అశ్వారావుపేట:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం నారాయణపురం కాలనీ గ్రామ నివాసి నంబురి గ్రేషమ్మ. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో కోవిడ్ తో బాధపడుతూ శ్వాస తీసుకోలేక కొత్తగూడెం హాస్పటల్లో చేరారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. అంత్యక్రియలు నిర్వహించడానికి పియస్ఆర్ ట్రస్ట్ నిర్వాహకులు జక్కుల రాంబాబుకు తెలియజేశారు. ఆయన వెంటనే స్పందించి స్థానిక పంచాయతీ ద్వారా పీపీఈ కిట్స్ తీసుకొని తన సహచరులతో కలిసి, గ్రేషమ్మ కుటుంబ సభ్యులు సూచనలు మేరకు ఊరి బయట అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు చేయలేని స్థితిలో ఉన్న పేద కుటుంబాలకి ఆపద్బాంధవుల్లా వచ్చి సహాయం చేస్తున్నందుకు గ్రామస్తులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: