CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉జిల్లాలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులు.

Share it:

 


👉855 మందిపై కేసులు.

👉8,55,000/-ల రూపాయల జరిమానాలు.

మన్యం టీవీ కొత్తగూడెం:-

తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా విధించిన లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై జిల్లా పోలీసులు కేసులు నమోదు చేయడం,జరిమానాలు విధించడం జరిగింది.జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు ఈ రోజు చేపట్టిన తనిఖీలలో మాస్కులు ధరించకుండా బయట తిరిగిన 855 మందిపై కేసులు నమోదు చేసి 8,55,000/-ల రూపాయలను జరిమానాగా విధించడం జరిగింది.లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి అనుమతించిన సమయం తర్వాత బయట తిరుగుతున్న 249 వాహనాలను,తెరిచి ఉన్న 09 దుకాణాలను సీజ్ చేయడం జరిగింది.డిసాస్టర్ మేనేజ్మెంట్ మరియు ఎపిడిమిక్ డీసీజస్ యాక్ట్-1897 ప్రకారం ఐపిసి సెక్షన్లతో 74 కేసులను నమోదు చేయడం జరిగింది.129 ఈ-పెట్టి కేసులను కూడా నమోదు చేయడం జరిగింది.ఇట్టి తనిఖీలలో సీజ్ చేసిన వాహనాలను లాక్ డౌన్ ముగిసేంత వరకు పోలీసు వారు తిరిగి ఇవ్వడం జరగదని జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ నేడు తెలియజేశారు.

Share it:

TELANGANA

Post A Comment: