CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...

Share it:

 



భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం రైల్వే లైన్ భూనిర్వాసితులందరు భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తూ రైతుల తీర్మానం

మన్యం టీవీ, మణుగూరు:

మండలంలోని రామనుజవరం పంచాయతీ రైల్వే లైన్ భూనిర్వాసిత ట్రైబులు,నాన్ ట్రైబులు అందరు రైల్వే లైన్ కు భూములు ఇచ్చేందుకు నిరాకరించారు.ఇప్పటికే మేము భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఉమ్మడి పంచాయితీగా ఉన్నపుడు మా భూములు ఇచ్చాము అంతేకాకుండా ఒక పక్క సింగరేణి ఓసి మరోపక్క సీతమ్మ సాగర్,సీతారామ ప్రాజెక్టు ఇలా అన్ని వైపులా మేము భూములు కోల్పోతున్నాము కాని అధికారులు మాత్రం మాకు నష్ట పరిహారం ఇచ్చే విషయంలో మాత్రం అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మరి బిటిపియస్ కరెంట్ టవర్ లైన్ కోసం మాత్రం కుంటకు లక్ష రూపాయలు నష్ట పరిహారం అందించారు.ఇప్పుడు మాత్రం కుంటకు కేవలం పది వేలు మాత్రమే ఇస్తామని చెపుతున్నారు.రైల్వే లైన్ నిర్వాసితులకు ఇప్పటికే రెవిన్యూ ద్వారా నోటీసులు పంపిస్తున్నారు అయిన నిర్వాసితులు తీసుకోకపోవడంతో పోస్ట్ ద్వారా నోటీసులు పంపిస్తున్నారు.నోటీసులు తీసుకోవాలని రెవిన్యూ,పోస్టపీస్ వారు భూనిర్వాసిత రైతులను భయ బ్రాంతులకు గురి చేస్తున్నారని అయిన పిసా గ్రామసభ తీర్మానం లేకుండా అవార్డ్ తీర్మానించడం ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం బిటిపియస్ లో భూములు కోల్పోయిన రైతులకు ఇచ్చిన విదంగా బిటిపియస్ రైల్వే లైన్ నిర్వాసితులకు కుడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అరుహులైన్ వారికి ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని లేని యడల భూములు ఇవ్వబోమని రామనుజవరం పంచాయితీ రైల్వే లైన్ నిర్వాసితులు తీర్మానించారు.ఈ కార్యక్రమంలో ,పండు నరసిమ్మగారు ,మండారి ఆదయ్యగారు ,సున్నం. సునీత గారు తాటి పుల్లయ్యగారు,బంగారు ఏసుబాబు గారు ,జంపన సీతారామ రాజు,గారు సాదిని సీతయ్యగారు జనార్ధన్ రెడ్డిగారు ,పెంట్యాల క్రిష్ణ గారు మరియు భూనిర్వాసితులు పాల్గొన్నారు...మి రామానుజవరం సర్పంచ్, టీజీ ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బాడిశ. సతీష్ తదితరులు పాల్గోన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: