CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతు అంటే ఏమిటో తెలియని వాళ్ళు రైతుల సమస్యల గురించి మాట్లాడటం హాస్యాస్పదం.-వల్లిపల్లి బాలమురళి బీజేపీ నాయకులు.

Share it:


మన్యం టీవీ మంగపేట.

మంగపేట మండల కేంద్రం లో బీజేపీ నాయకులు వల్లి పల్లి బాలమురళి కొంతమంది విద్యార్థి నాయకులు తెలిసి తెలియక బీజేపీ ప్రభుత్వం పై అవాకులు చవాకులు పేలుతున్నారు ఈ విదంగా 

రైతులకు ఉరితాళ్లు గా మారె నల్ల చట్టాలను రద్దుచేయాలి, రైతులపై నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడుదాం, రైతుంగాన్ని కాపాడుకుందాం అంటూ బీజేపీ ని విమర్శించిన ఎస్ ఎఫ్ ఐ నాయకులు, డి వై ఎఫ్ ఐ నాయకుల వ్యాఖ్యలు ఖండిస్తూ 

మంగపేట మండల బీజేపీ సీనియర్ నాయకులు వల్లిపల్లి బాలమురళి పాత్రికేయులతో ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎస్ ఎఫ్ ఐ నాయకులు అసందర్బ ప్రేలాపణలు మానుకోవాలి, రైతు అంటే కూడా తెలియని వాళ్ళు రైతుల గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఈ సందర్బంగా బీజేపీ సీనియర్ నాయకులు వల్లిపల్లి బాలమురళి ఎద్దేవా చేసారు.మీరు ఏమి మాట్లాడుతున్నారో కాస్త తెలుసుకుని మాట్లాడితే మీకు సమాధానం లభిస్తుంది. స్వామినాధన్ కమిటీ సూచనలుమేరకు రైతు పంట పై పెట్టిన రేటు కు అదనంగా ఒకటిన్నర రెట్లు వచ్చేలా పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇచ్చాము (మినిమం సపోర్ట్ ప్రైస్ )అది మీకు తెలుసా.రైతు తాను పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకొనే స్వేచ్ఛను కల్పించాము.రైతుల సౌలభ్యం కోసం వెయ్యికి పైగా మార్కెట్లు ఏర్పాటు చేసాము.చిన్న రైతులను గుర్తించి వారికి కిసాన్ క్రెడిట్ కార్డులను అందిచాము.రైతులతో పాటు మత్యకారులకు, పాడిపరిశ్రమను ప్రోత్సాహంచే రైతులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు, పీఎం కుసుమ్ పథకం ప్రవేశపెట్టి ప్రజల ఆదాయాన్ని లక్షల్లో పెంచిన ప్రభుత్వం మోదీ ప్రభుత్వమే.మోదీ ప్రధాన మంత్రిగా వచ్చిన దగ్గరనుండి రైతు పక్షాన నిలబడి పనిచేస్తూ రైతుల పక్షపాత ప్రభుత్వం గా పేరు తెచ్చుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని మీరు విమర్శలు చేయడం హాస్యాస్పదం, అవగాహనా రాహిత్యం, అనుభవరాహిత్యం కొట్టొచ్చినట్టు కన్పిస్తుంది.ప్రధాన మంత్రి సమ్మాన్ యోజన పథకం కింద 93 వేల కోట్ల ఖర్చుతో దేశలోని 10కోట్లమందికి, తెలంగాణ రాష్ట్రం లో 35 లక్షలమందికి ప్రయోజనం చేకూరింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కేంద్రం ఎన్ని వేలకోట్లు రాష్ట్రానికి వచ్చాయో లెక్క చెప్పలేదు. ఒక్క భూ సారం పరీక్షలకు కేంద్రం నుండి 125 కోట్ల రూపాయలు రాష్ట్రనికి వస్తే ఇంతవరకు ఏమి పని చేసారో కూడా తెలియని పరిస్థితిలో తెరాస ప్రభుత్వం ఉంది. ఇంకా ఎన్నో, ఇటువంటి పథకాలు మోదీ జి ఆధ్వర్యంలో విజయవంతంగా అమలు చేస్తున్నాం.నిజ నిజాలు తెలియకుండ మా పార్టీ మీద ఆపనిందలు, ఆరోపణలు తగదు అని ఈ సందర్బంగా బీజేపీ సీనియర్ నాయకులు వల్లిపల్లి బాలమురళి తెలియజేసారు.

Share it:

TELANGANA

Post A Comment: