CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎస్సి కార్పొరేషన్ ద్వార కరోనా బాధితులకు నిత్యావసర కిట్లు అందించాలి

Share it:

 



కరోనా టెస్టులో వేగం పెంచాలి

హోమ్ క్వారంటైన్ ఉన్న వారికి

సౌకర్యాలు కల్పించాలి


కాంగ్రెస్ ఎస్సి సెల్ అధ్యక్షుడు యాదగిరి

మన్యం టీవీ మంగపేట.


కరోనా బారిన పడి హోమ్ క్వా రంటైన్ లో ఉన్న ఎస్టీలకు ఐటిడిఎ ద్వార అందిస్తున్న నిత్యావసర కిట్లను ఏ విదంగా అందిస్తున్నారో అదేవిధంగా కరోనా బారిన పడి హోమ్ క్వా రంటైన్ లో ఉన్న నిరు పేద ఎస్సిలకు కుడా ఎస్సి కార్పొరేషన్ ద్వారా నిత్యావసర సరుకుల కిట్లను అందించాలని మంగపేట కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు పల్లికొండ యాదగిరి డిమాండ్ చేశారు.

విలేకరులతో యాదగిరి మాట్లాడుతూ మంగపేట మండల వ్యాప్తంగా కరోనా బారిన పడి హోమ్ క్వారంటైన్ లో ఉన్న నిరుపేద ఎస్సిలకు ఐటిడిఏ ద్వార హోమ్ క్వారం టైన్ లో ఉన్న గిరిజనులకు ఏ విదంగా నిత్యావసర సరుకుల కిట్లు అందిస్తున్నారో అదే విదంగా ఎస్సిలకు కుడా ఎస్సి కార్పొరేషన్ ద్వార అందించాలని అన్నారు.ఎస్సి కుడా నిత్యావసర సరుకుల కిట్లు అందించే విదంగా ఎస్సి కార్పొరేట్ అధికారులు దృష్టి సారించి ఉన్నతాధికారులు తెలియజేసి అమలు అయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు.మండలంలో కరోనా టెస్టులు చేసే ఆరోగ్య కేంద్రల్లో  సరిపడ సిబ్బంది లేక కరోనా టెస్టులు ఆలస్యంగా చేస్తున్నారని ఆలస్యం చేయడం వల్ల కరోనా వైరస్ ఒకరి నుండి ఒకరికి వచ్చే ప్రమాదం ఉందని వెంటనే ఆరోగ్య శాఖ అధికారులు సరిపడ వైద్య సిబ్బందిని నియమించి కరోనా టెస్టుల వేగవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా లక్షణాలు ఉన్న వారికి కరోనా మెడికల్ కిట్ ను అందజేయాలని చెప్పినకానీ  అది అమలు కావడం లేదు ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో వైద్య సిబ్బంది పర్యటించి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారికి వెంటనే కరోనా మెడిసిన్ కిట్ అందజేయాలి హోమ్ క్వారంటైన్ లో ఉన్న వారికి బోజనాలను కనీస సౌకర్యాలు కల్పించాలని ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు పల్లి కొండ యాదగిరి అధికారులను డిమాండ్ చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: