CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అర్హులైన ప్రతి జర్నలిస్ట్ కి అక్రిడేషన్ కార్డు మంజూరు చేస్తాం..

Share it:

 


జిల్లా వ్యాప్తంగా ఒక డేట్ ఖరారు చేసి కోవిడ్ వ్యాక్సిన్ ఏర్పాటు చేస్తాను..

అక్రిడేషన్ సమావేశంలోనే వైద్యాధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ...




మన్యం టీవీ : కొత్తగూడెం,  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జర్నలిస్టుల అక్రిడేషన్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం నాడు జూమ్ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో  అక్రిడేషన్ కమిటీ సభ్యులు, (టీయూడబ్ల్యూజే ఐజేయూ) జిల్లా అధ్యక్షులు బి.వి.రమణారెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టులు అనేక కష్ట నష్టాలు భరిస్తూ పేపర్లలో చానల్స్ లో పని చేస్తున్నారని, ఒక్క అక్రిడేషన్ కార్డు తప్ప ప్రభుత్వం నుండి జర్నలిస్టులకు ఎటువంటి సహాయం లేదని, కావున అప్లై చేసిన జర్నలిస్టులందరికీ కార్డులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన కలెక్టర్ అందరికీ అందించే ఏర్పాటు చేస్తానని తెలిపారు. నాకు జర్నలిస్టులు పడుతున్న కష్టం తెలుసునని వారిని అన్ని విధాలా ఆదుకుంటానికి ప్రయత్నిస్తానని అన్నారు. జర్నలిస్టులు కూడా జిల్లా యంత్రాంగానికి అన్ని విధాల సహకారం అందించాలని కోరారు. జిల్లాలో ఎక్కడైనా  లోటుపాట్లు  జరిగితే నేరుగా నా దృష్టికి తీసుకురావాలని కోరారు.

మూడో విడత అప్లై చేసుకున్న జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని, రెండో సమావేశం మంజూరు చేసిన అక్రిడేషన్ లలో కొన్ని కార్డులు ఆగిపోయినందున  వాటిని కూడా పంపిణీ చేయాలని కోరగా. దీనికి స్పందించిన కలెక్టర్ అందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు.

అంతేకాకుండా కరోనా టైంలో ఫ్రంట్ వారియర్స్ గా పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇప్పించాలని కోరడం జరిగింది. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశిస్తూ జిల్లాలోని జర్నలిస్టులందరకు, వారి కుటుంబాలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. వైద్యాధికారులు స్పందిస్తూ ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం ఆగి పోయినందున తిరిగి ఆదేశాలు రాగానే ఒక డేట్ ఖరారు చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జర్నలిస్టులకు, వారి కుటుంబాలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడతామని వైద్య అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అనుదీప్, కర్నాటి వెంకటేశ్వర్లు, డీపీఆర్వో శ్రీనివాసరావు, ఆర్టీసీ రైల్వే అధికారులు , అక్రిడేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: