CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జూన్ నెలకి ఉచిత బియ్యం పంపిణీ

Share it:

 


👉జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్ర ప్రకాష్

మన్యం టీవీ, కొత్తగూడెం:

జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్ర ప్రకాష్ రేషన్, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డు దారులకు జూన్ మాసంలో ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్ర ప్రకాష్ తెలిపారు.  

ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ బియ్యం పంపిణీ కేటాయింపులు చేసినట్లు చెప్పారు. తెల్ల రేషన్ కార్డు దారులకు కుటుంబంలో ప్రతి ఒక్కరికి 15 కేజీలు, అంత్యోదయ కార్డు దారులకు 35 కేజీలతో పాటు కుటుంబంలోని ప్రతి ఒక్కరికి 10 కిలోలు, అన్నపూర్ణ కార్డు దారులకు 10 కేజిలతో పాటు వొక్కక్క కుటుంబ సభ్యునికి 10 కేజీలు చొప్పున బియ్యం ఉచిత పంపిణీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. రేషన్ దుకాణ డీలర్లు బియ్యం పంపిణీ లో కరోనా వ్యాధి నిబంధనలు పాటిస్తూ బియ్యం తీసుకోవడానికి రేషన్ దుకాణాలకు రావాలని ఆయన చెప్పారు. పంపిణీలో ఓటీపీ మరియు ఐరిష్ సమస్యలు లబ్ధిదారుల నుండి ఫిర్యాదులు రాకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన డీలర్లుకు సూచించారు.

Share it:

Post A Comment: