CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బ్రహ్మోత్సవాలకు భక్తులకు అనుమతి లేదు: ఈఓ

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు శ్రీహేమాచల క్షేత్రం కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు మే 22 నుండి మే 31 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈ.ఓ సత్యనారాయణ బుధవారం తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు మే 22న విష్వక్షేనపూజ, భగవత్‌ పుణ్యావచన, రక్షా బంధనం, అంకురార్పణ తదితర పూజా కార్యక్రమాలు ఉంటాయని ఈ.ఓ సత్యనారాయణ తెలిపారు. 23న గరుడాధివాసం, 24న ధ్వజారోహణం,సుదర్శన హోమం,25న ఎదుర్కోలు, శ్రీ లక్ష్మీ నరసింహ సహస్రనామ పారాయణం, హవనం, 26న మధ్యాహ్నం 1 గంటకు అభిజిత్ లగ్నం లో స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం, 27న రథోత్సవం, సంక్షిప్త రామాయణ పారాయణం, హవనం, 28న సదస్యం(వేదాశీర్వాచనం,) శ్రీహయగ్రీవస్తోత్ర పారాయణం, హవనం, 29న తెప్పోత్సవం, దోపోత్సవం, శ్రీ లక్ష్మి సహస్రనావమ స్తోత్ర పారాయణం, హవనం, 30న చక్రస్నానం, మహా పూర్ణాహుతి, పుష్పయాగం, సుదర్శన నరసింహా హావనం, 31న వసంతోత్సవం తదితర కార్యక్రమాలు ఉంటాయని ఈ.ఓ సత్యనారాయణ తెలిపారు. లాక్ డౌన్నిబంధనలకు లోబడి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని, మురళీ కృష్ణమాచార్యులు పర్యవేక్షణలో వేద పండితులు మరియు అర్చకులు శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని ఈఓ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో అంతరంగికంగా మాత్రమే నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు భక్తులకు అనుమతి ఉండదని, భక్తులు ఈ విషయాన్ని గమనించి దేవస్థానంకు సహకరించాలని ఈఓ కోరారు.

Share it:

TELANGANA

Post A Comment: