CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మీ బెదిరింపులకు భయపడం - ఈటల జమున

Share it:



హైదరాబాద్ :

నెల రోజులుగా జమున హేచరీస్, గోడౌన్‌లపై ఈ ప్రభుత్వం బురద జల్లుతోందని మాజీ మంత్రి ఈటల సతీమణి జమున ఆవేద వ్యక్తం చేశారు. అసత్య ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలో తమకు తెలుసన్నారు. కష్టాన్ని నమ్ముకున్న వాళ్లమని.. వ్యాపారం కోసం తమ కుమారుడు మసాయిపేటలో 46ఎకరాల భూమి కొన్నది వాస్తవమని, తాము బడుగుల భూమి అక్రమించుకున్నామని నమస్తే పత్రికలో తప్పుడు రాతలు రాశారన్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా తమ భూములు కొలుస్తారా అని ప్రశ్నించారు. ఒక మహిళగా అనేక మందికి ఉపాధి ఇస్తున్నానని, ఇదేనా మహిళా సాధికారత అని నిలదీశారు. దేవరాయాంజల్ భూములు అక్రమించుకున్నామని రాస్తున్న పత్రిక సిగ్గుపడాలన్నారు. ఆ భూములను కుదువ పెట్టి తాము పత్రికకు సహాయం చేశామన్నారు. ఆ రోజు అవి దేవుని భూములని తెలియదా అన్నారు. దేవుని భూములైతే బ్యాంక్ ఎలా లోన్ ఇస్తుందన్నారు. 


‘‘ప్రభుత్వం నీచానికి దిగజారింది. మేము ఏ తప్పు చేయలేదు, ఎవరికీ భయపడం. ఇంట్లోవాళ్లను అందరినీ రోడ్డుకు లాగాలని స్కెచ్ వేశారు. నా కొడుకును బయటకు లాగడానికి భూములు ఆక్రమించారని చెబుతున్నారు. నలుగురి చేతులు మారిన తర్వాత మేము కొన్నాం. ఈటెల రాజేందర్ మీద ఆరోపణలు వచ్చిన వెంటనే యంత్రాంగం మొత్తం కదులుతోంది. రైతుల భూములు కొలవాలంటే మాత్రం కదలరు. ఈటెలను బయటకు పంపిస్తే తమ కుటుంబమే పాలించుకోవచ్చని, ప్రగతి భవన్ స్కెచ్ వేసింది. మేము ఏ విచారణకైనా సిద్ధం. సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి. మీ కుటుంబానికి ఆస్తులు ఎలా వచ్చాయి? మా ఆస్తులు, మీ ఆస్తుల మీద చర్చిద్దామా? ఉద్యమంలో మేం డబ్బులు పెట్టిన రోజు ఎక్కడివి అని ఎందుకు అడగలేదు? మంత్రులు కూడా ఒకరింటికి ఒకరు దొంగతనంగా వెళ్లాల్సిన పరిస్థితి. ఆస్తులు కాపాడుకోవడానికి పదవుల కోసమైతే ఆనాడే వైఎస్ దగ్గరకు వెళ్ళే వాళ్ళం. వకులాభరణం లాంటి చీప్ మనుషులతో మాట్లాడిస్తున్నారు. తమ్మి తమ్మి అని తడిబట్టతో గొంతు కోశారు. కులరహిత సమాజం కోసమే రాజేందర్, నేను పెళ్లి చేసుకున్నాం. కానీ తెలంగాణా వచ్చాక కులాలుగా విభజించారు. తెలంగాణ వచ్చాక ఏనాడు సంతోషంగా లేము. అన్నీ అవమానాలే. ఆస్తులు అమ్మైనా ఆత్మగౌరవ పోరాటం చేయాలని నా భర్తకు చెబుతున్నా’’ అని ఈటల సతీమణి భావోద్వేగానికి గురయ్యా రు.

Share it:

TELANGANA

Post A Comment: