CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

AP

ప్ర‌భుత్వాస్ప‌త్రికి అండ‌గా నేనుంటా :విడదల రజిని

Share it:





విఆర్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో క‌రోనా రోగుల‌కు మూడు పూట‌లా పౌష్టికాహార భోజ‌నం


ఆక్సిజ‌న్ స‌మ‌స్య రాకుండా చూస్తున్నాం

వైద్య సిబ్బంది నియామ‌కానికి సంబంధించి ఇప్ప‌టికే క‌లెక్ట‌ర్ గారు ఆదేశాలు జారీ


చిల‌క‌లూరిపేట ప్ర‌భుత్వాస్ప‌త్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని 



గుంటూరు : 

చిల‌క‌లూరిపేట‌లోని ప్ర‌భుత్వాస్ప‌త్రికి తాను అండ‌గా ఉంటాన‌ని, కావాల్సిన సౌక‌ర్యాల‌న్నీ క‌ల్పిస్తాన‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని  భ‌రోసా ఇచ్చారు. స్థానిక సీహెచ్‌సీని ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని  సోమ‌వారం అకస్మికంగా త‌నిఖీ చేశారు. క‌రోనా రోగుల‌కు అందుతున్న చికిత్స‌పై  ఆరా తీశారు. ఈ సంద‌ర్భంగా వైద్యులు మాట్లాడుతూ బెడ్లు, మందులు స‌రిప‌డా ఉన్నాయ‌ని చెప్పారు. ఆక్సిజ‌న్‌, రెమిడెసివ‌ర్ ఇంజిక్ష‌న్లు స‌రిప‌డా అందితే ఏ ఇబ్బంది లేకుండా రోగుల‌కు చికిత్స అందించ‌వ‌చ్చ‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ ప్ర‌భుత్వాస్ప‌త్రికి బెడ్ల స‌మ‌స్య లేద‌ని, ఆస్ప‌త్రి సామ‌ర్థ్యానికి స‌రిప‌డా బెడ్లు ఉన్నాయ‌ని తెలిపారు. క‌రోనా బెడ్ల సామ‌ర్థ్యాన్ని కూడా పెంచుతున్నామ‌ని, ఇప్ప‌టికే దీనిపై తాను  క‌లెక్ట‌ర్,సబ్ కలెక్టర్  తో మాట్లాడాన‌ని వెల్ల‌డించారు. వైద్య సిబ్బంది కొర‌త లేకుండా చూడాల‌ని తాను ఉన్న‌తాధికారుల‌ను కోరిన‌ట్లు చెప్పారు. ప్ర‌స్తుతం వైద్య సిబ్బంది నియామ‌కాలు జ‌రుగుతున్నాయ‌ని, స‌బ్‌క‌లెక్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో వైద్య సిబ్బంది కి ఇంట‌ర్వ్యూలు ప్ర‌తి రోజు జ‌రుగుతున్నాయ‌ని వెల్ల‌డించారు. ఆస‌క్తి ఉన్న వారు ఇంట‌ర్య్వూల‌కు హాజ‌రు కావాల‌ని కోరారు. వెనువెంట‌నే వారిని విధుల్లోకి తీసుకుంటామ‌ని చెప్పారు. ఒక‌టి, రెండు రోజుల్లో స‌రిప‌డా సిబ్బందిని తీసుకుంటామ‌ని తెలిపారు. మెరుగైన వైద్య సేవ‌లు అందించ‌డ‌మే ల‌క్ష్యంగా వైద్య‌సిబ్బంది, తాము ప‌నిచేస్తున్నామ‌న్నారు.


వీఆర్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో రోగుల‌కు భోజ‌నం


ప్ర‌భుత్వాస్ప‌త్రిలో క‌రోనా రోగుల‌కు త‌మ సొంత వీఆర్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో మూడు పూట‌లా మంచి భోజ‌నాన్ని అందిస్తామ‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని  తెలిపారు. మున్సిప‌ల్ చైర్మ‌న్ ర‌ఫాని, మార్కెట్ యార్డు చైర్మ‌న్ బొల్లెద్దు చిన్న త‌దిత‌రుల‌తో ఒక క‌మిటీ ఏర్పాటుచేసి ప్ర‌భుత్వాస్ప‌త్రిని నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తామ‌ని చెప్పారు. రోగుల‌కు చికిత్స అందించే విష‌యంలో ఏ స‌మ‌స్యా రానీకుండా చూస్తామ‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే  ప‌లువురు రోగుల‌తో స‌మ‌స్య‌ల‌పై ఆరా తీశారు.ఈ కార్యక్రమంలో డిఎస్పీ విజయభాస్కర్,ఇంచార్జి కమిషనర్ ఫణి కుమార్,డాక్టర్లు భవాని,మోజేశ్,గోపి నాయక్,నోడల్ అధికారి శ్రీనివాసరావు,మున్సిపల్ చైర్మన్ రఫాని,వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు,మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లెద్దు చిన్న,కౌన్సిలర్ విడదల గోపి, పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహాఖాన్, ప్రధాన కార్యదర్శి మారుబోయిన నాగరాజు,మరియు పలువురు నాయకులు ఉన్నారు.



Share it:

AP

Post A Comment: