CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జూలూరుపాడు మండల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బందికి సన్మానం...

Share it:

 





 మన్యం టీవీ : జూలూరుపాడు,       భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి, మండల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో శనివారం వైద్య సిబ్బంది సేవలను గుర్తిస్తూ వారికి  అభినందన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం  జరిగింది. ఈ సందర్భంగా మండల సిపిఐ పార్టీ నాయకులు షేక్ నాగుల్ మీరా మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి రాష్ట్రం, దేశం,లోనే కాకుండా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది అని ,ఈ వైరస్ కారణంగా సామాన్య, మధ్యతరగతి, అనేక రంగాలలో మహామహులను సైతం ఈ వైరస్ పొట్టన పెట్టుకుంది అన్నారు. ప్రస్తుతం రెండవ దశ కరోనా వ్యాప్తి ఉధృతంగా గ్రామ గ్రామాన తన ప్రతాపం చూపిస్తోంది అన్నారు. ఎవరికి వారు తమ కుటుంబాలను వదిలి బయటకు వచ్చేందుకు కూడా బెంబేలెత్తిపోతున్నారు, అయినా సరే వైద్య సిబ్బంది తమ ప్రాణాలను లెక్కచేయకుండా సమాజ సేవే తమ లక్ష్యంగా రోగుల ప్రాణాలను కాపాడేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు అన్నారు. నిరంతరం  వైద్య పరీక్షలు చేస్తూ పాజిటివ్ వచ్చినవారికి సేవలందిస్తూ, అదేవిధంగా మరోపక్క కోవిడ్ వ్యాక్సిన్లు వేస్తూ అనేక రకాలుగా ప్రజలకు సేవలందిస్తున్నారు అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది కరోనా బారినపడిన అవేమీ పట్టించుకోకుండా, మిగతా సిబ్బంది ప్రజల ఆరోగ్యాలు కాపాడేందుకు  నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నారన్నారు.  మండలం లో సిపిఐ పార్టీ ప్రజల పట్ల నిర్లక్ష్యం వహించే వారిని ఎప్పటికప్పుడు ఎండగడుతూ, అదేవిధంగా ప్రజల సంక్షేమం కోసం పాటు పడే వారిని ఎప్పుడూ అభినందిస్తూ వారిని ప్రోత్సహించడంలో జూలూరుపాడు మండలం లో సిపిఐ పార్టీ ముందుంటుందని నాగుల్ మీరా అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి శ్రీధర్ , సిహెచ ఓ  వెంకటేశ్వర్లు, హెల్త్ సూపర్వైజర్లు రత్న కుమార్ , కృష్ణ   ,ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు, సిపిఐ పార్టీ నాయకులు కొండ వీరయ్య, సమీర్ పవన్ సాయి సతీష్ గణేష్ ఉదయ్ సంతోష్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: