CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూమి కోల్పోయి మనోవేదనతో ఆదివాసీ గిరిజన రైతు లక్ష్మ య్య బలవన్మరణం..

Share it:

 


👉బువ్వపెట్టే భూములను లాక్కుంటున్న ప్రభుత్వం..


👉పేదోడికి బ్రతుకులేకుండా చేస్తున్న ప్రభుత్వ చర్యలని ప్రతిఘటించాలి..


👉లక్ష్మ య్య కుటుంబానికి న్యాయం చేయాలి..


👉పోడు భూములను లాక్కునే చర్యలను ప్రభుత్వం మానుకోవాలి..


సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాబీర్‌ పాషా...



మన్యం టీవీ : కొత్తగూడెం, మూడు దశాబ్ధాలుగా తన కుటుంబానికి జీవనాదారంగా ఉన్న పోడు భూమిని అటవీశాఖ అధికారులు లాక్కోవడంతో మనోవేదనకు గురైన బాడిశ లక్ష్మయ్య (58) అనే ఆదివాసి గిరిజన రైతు ఉచ్చువేసుకొని బలవన్మరణం చెందిన సంఘటన మంగళవారం లక్ష్మి దేవిపల్లి మండల పరిధిలోని లక్ష్మి పురం గ్రామపంచాయతీ, ఆర్లగండి ఎజెన్సీ గ్రామంలో చోటుచేసుకుంది. మృతుడు లక్ష్మ య్య గత 30 సంవత్సరాలుగా 15 ఎకరాల పోడు భూమిని సాగుచేసుకుంటూ జీవిస్తున్న "క్రమంలో అటవీశాఖ అధికారులు పది ఎకరాలకుపైగా లక్ష్మయ్య భూమిని స్వాదీనంచేసుకొని ట్రంచ్‌లు ఏర్పాటు చేశారు. భూమిని కోల్పోవడంతో గుండెనిబ్బరం కోల్పోయిన లక్ష్మ య్య ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాభీర్‌ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు వై.శ్రీనివాసరెడ్డిలు లక్ష్మయ్య మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఘటన వివరాలను కుటుంబ సభ్యులు, గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సాబీర్‌ పాషా మాట్లాడుతూ.. కరోనా విలయతాండం చేస్తున్న విపత్కర పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం పోడు సాగుదారులపై దాడులకు ఉసిగొల్బడం హేయమైన చర్య అని అన్నారు. మూడు దశాద్చాలుగా లక్ష్మ య్య కుటుంబం పోడు సాగుచేసుకుని జీవిస్తున్నారని, ప్రాజెక్టుల నిర్మాణానికి, పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడి దారులు, పారిశ్రామిక వేత్తలకు వేలాది ఎకరాలు దారాత్తం చేస్తున్న ప్రభుత్వం బ్రతుకుదెరువుకోసం పోడు సాగుచేసుకుంటున్న పేదలపై యుద్దం ప్రకటించడం దారుణమన్నారు. తమ పూర్వీకుల కాలం నుంచి అడవులనే నమ్ముకొని జీవిస్తున్న గిరిజనులను ఆ అడవులనుంచి దూరం చేసి బ్రతుకు లేకుండా చేసే కుట్రలు సరికాదన్నారు. చట్ట ప్రకారం తమకు భూములపై హక్కులు కల్పించాలని గిరిజనులు చేసుకున్న దరఖాస్తులను బుట్టదాఖలు చేసి నిర్భందాలకు పూనుకోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వ ఆదెశాలతో అటవీశాఖ జరుపుతున్న దాడులతో అమాయక గిరిజనులు బయబ్రాంతులకు గురి అవుతున్నారని అన్నారు. అటవీశాఖ అధికారులు కవ్వింపు చర్యలు మానుకొని యంత్రాలను తీసుకొని పోడు భూముల నుంచి వెల్లిపోవాలని లేనిపక్షంలో భూములను దక్కించుకునేందుకు ప్రతిఘటన ఉద్యమాలకైనా వెనుకాడబోమని హెచ్చరించారు. ఆత్మహత్య చేసుకున్న లక్ష్మ య్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, స్వాదీనం చేసుకున్న భూములను తిరిగి లక్ష్మయ్య కుటుంబానికి అప్పగించాలని లేనిపక్షంలో ప్రతిఘలన ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.. నివాళులర్పించిన వారిలో సర్పంచ్‌లు రాజబాబు, వసంతరావు, ఉపసర్పంచ్‌ మోహన్‌రావు, మృతుడు లక్ష్మ య్య కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు బాడిశ పుల్లయ్య, బడిశ సూరయ్య, విజయ్‌కుమార్‌, శివాజి, జోగ నర్సింహారావు, మల్కం నాగేష్‌, పాపారావు, బాడీష అమ్మక్క సత్తెమ్మ, సరోజిని* తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: