CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

రామానుజవరం గ్రామ పంచాయతీలో సీతారామ సాగర్ ప్రాజెక్టులో భూ నిర్వాసితుల రైతుల కొరకు పిసా గ్రామా సభ

Share it:

 


అదనపు కలెక్టర్ కర్నాటి.వెంకటేశ్వర్లు


మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, రామానుజవరం గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్దా  సీతారామ సాగర్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతుల కొరకు పిసా గ్రామా సభ నిర్వహించడం జరిగింది.ఈ సభలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు,తహసీల్దార్ చంద్ర శేఖర్ సభకు హాజరు కావడం జరిగింది.సభలో రైతులు మాట్లాడుతూ రామానుజవరం రెవిన్యూ  పరిధిలో గల బిటిపిఎస్, ఇంటెక్ వెల్,రైల్వే లైన్, సీతారామ ప్రాజెక్టు ఇలా ఎక్కువ శాతం భూమి మా యొక్క పంచాయతీ లోనే రైతులు కోల్పోతున్నారు. వ్యవసాయ ఆధారిత జీవనం సాగిస్తున్న మా రైతులకు ఇప్పుడు ఎలాంటి ఆధారం లేదు అన్నారు, బిటిపిఎస్ లొ భూములు తీసుకొని 7 సంవత్సరంలు గడుస్తుంది అని ఇంత వరకు ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వలేదు అన్నారు.మా పంచాయతీ లొ ఇంటెక్ వెల్ కట్టారు అని,ఇంతవరకు అక్కడ ఉద్యోగాలు ఇవ్వలేదు అన్నారు.పనిలో పెట్టుకొని కూడా జీతాలు ఇవ్వడం లేదు అని అన్నారు.పొలాలు ఇచ్చి రైతు రోడ్డు మీదా పడ్డ మీరు మాత్రం మి పనులు చేసుకుంటున్నారు తప్పా, మా రైతులకు న్యాయం చెయ్యడం లేదు అన్నారు. అలాగే రైల్వే లైన్ లొ  ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు మరల ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు కు పిసా గ్రామ సభ ఏర్పాటు చేశారు అని,ఏ రైతు కు న్యాయం చేశారని మా రైతులు భూములు ఇవ్వాలి అని అడగడం జరిగింది.అలాగే రైతుల అభీష్టం మేరకు  సీతారామ ప్రాజెక్టు లొ ఎకరాకు 50లక్షలు,ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి అని అలాగే రైతులు ఎడారి రమేష్,బత్తిని చందర్ రావు  పెంట్లలా.కృష్ణ రైతులకు న్యాయం చెయ్యాలని ఎక్కువ భూమి కోల్పోయిన వారికి మరల భూమి ఇవ్వాలి అని,మంచి ప్యాకేజి మరియు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి అని అడగడం జరిగింది.ఇట్టి విషయాలను జాయింట్ కలెక్టర్ కు తెలియజేసస్తూ,రైతులకు న్యాయం చెయ్యాలి అని గ్రామ పంచాయతీ నుండి తీర్మానం చెయ్యడం జరిగింది.ఇట్టి విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి మా రైతులకు న్యాయం జరిగేలా చూడవలసిందిగా కోరడమైనది.ఈ యొక్క కార్యక్రమం లొ జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ చంద్రశేఖర్, సిబ్బంది,రామానుజవరం సర్పంచ్ బాడిశ.సతీష్ మాజీ ఎంపీపీ ఎడారి.రమేష్, కార్యదర్శి సునీత,వార్డు సభ్యులు మాండరి ఆదయ్య,బత్తిని చందర్ రావు,పెంట్యాల కృష్ణ, మరియు రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: